Wednesday, March 12, 2025

నేచరల్‌ స్టార్‌తో కలిసి నటించే అవకాశం వస్తుందా?

బెంగుళూరు భామ రుక్మిణి వ‌సంత్ పేరు కూడా ఎక్కువ‌గా వినిపిస్తుంది. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది రుక్మిణి. క‌న్న‌డ హీరో ర‌క్షిత్ శెట్టి హీరోగా తెర‌కెక్కిన స‌ప్త సాగారాలు దాటి సైడ్ ఎ సినిమాతో రుక్మిణి సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. మొద‌టి సినిమాతోనే త‌న న‌ట‌న‌తో అంద‌రి మ‌న‌సుల్ని గెలుచుకున్న రుక్మిణి వ‌సంత్ ఆ త‌ర్వాత దానికి సీక్వెల్ గా వ‌చ్చిన స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్ బి లో కూడా న‌టించి నేచుర‌ల్ పెర్ఫార్మ‌ర్ గా మంచి పేరు ద‌క్కించుకుంది. గ‌తేడాది నిఖిల్ తో క‌లిసి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది రుక్మిణి. ఈ సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ద‌క్కుతుంద‌నుకున్న రుక్మిణి వ‌సంత్‌కు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తీవ్ర నిరాశ‌ను మిగిల్చింది. అస‌లు ఆ సినిమా ఎప్పుడు రిలీజైంది ఎప్పుడు థియేట‌ర్ల నుంచి పోయింద‌నే విష‌యం కూడా తెలియ‌కుండా జ‌రిగిపోయింది. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఆ సినిమా రుక్మిణిని చేదు అనుభ‌వాన్నే మిగిల్చింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా రుక్మిణి ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ లో త‌న‌కు ఇష్ట‌మైన హీరో ఎవ‌రో చెప్పింది. తెలుగులో మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవ‌రితో క‌లిసి న‌టించాల‌నుంద‌ని అడ‌గ్గా దానికి రుక్మిణి స‌మాధాన‌మిచ్చింది. త‌న‌కు నేచుర‌ల్ స్టార్ నానితో క‌లిసి ప‌ని చేయాల‌నున్న‌ట్టు తెలిపింది రుక్మిణి వ‌సంత్. నానితో క‌లిసి వ‌ర్క్ చేయ‌డ‌మంటే ఇష్ట‌మ‌ని చెప్తున్న రుక్మిణి, నాని రేంజ్ డిఫ‌రెంట్ అని, అత‌ను చేసే సినిమాల్లో ఒక అర్థముంటుంద‌ని తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com