Wednesday, June 26, 2024

తాజ్ మహల్ స్టార్ హోటల్ ను మించిన రుషికొండ రాజసం

  • రుషికొండ అతిధి గృహ రహస్యం బట్టబయలు

అది రాజరికానికి నిదర్శనం.. రాజసం ఉట్టిపడే కట్టడం.. రాజుల కోట ను మంచిన నిర్మాణం.. అందులో అంతపురాన్ని తలదన్నే సౌకర్యాలు.. ఇదేదో రాజస్ఠాన్ కోట గురించి అనుకుంటే మాత్రం మీరు పరపడినట్టే. ఇదంతా విశాఖపట్నంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ గెస్ట్ హౌజ్ గురించి. అవును రుషికొండ అతిధి గృహం గురించి అంతుపట్టని రహస్యాలు బయకు వస్తున్న కొద్ది అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

 

విశాఖపట్నం సమీపంలోని రుషికొండపైన గత వైసీపీ ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో ఓ అతిధి గృహాన్ని నిర్మించింది. దీని కోసం సుమారు 450 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. పర్యావరణానికి హాని చేసి రుషికొండపైన నిర్మాణాలు చేపట్టవద్దని ప్రతిపక్షాలు, పర్యావరణ నిపుణులు నెత్తినోరు మొత్తుకున్నా అప్పటి సీఎం వైఎస్ జగన్ మాత్రం వినిపించుకోలేదు. రుషికొండకు ఎవ్వరిని అనుమతించకుండా.. పోలీసు పహారా పెట్టి మరీ అతిధి గృహాన్ని నిర్మించారు. అసలు సదరు గెస్ట్ హౌజ్ ఎందుకు నిర్మస్తున్నారో, అందులో ఏముందే నిన్నటి వరకు అంతుపట్టని రహస్యం.

 

రుషికొండపై వైసీపీ సర్కార్ నిర్మించిన అతిధి గృహంలో అడుగజుగునా రాజసం ఉట్టిపడుతోందని చెబుతున్నారు. విశాలమైన గదులు, విదేశాల నుంచి తెప్పించిన ఫర్నీచర్, ఖరీదైన కళాకృతులు, పేరొందిన పేయింటింగ్స్, అత్యాధునిక సౌకర్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయట. స్నానం చేసే టబ్ ఖరీదు 26 లక్షల రూపాయలు, బాత్ రూం సెటప్ కు 22 లక్షల రూపాయలు, బెడ్ రూం ఫర్నీచర్ కు 45 లక్షలు, డైనింగ్ టేబుల్ సెట్ కు 34 లక్షలు.. అబ్బో ఇవన్నీ కేవలం మచ్చుకు మాత్రమే. ఐతే ఇదంతా నిన్నటి వరకు రహస్యం కాగా..ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం అధికారంలోకి వచ్చి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీభాద్యతలు స్వీకరించారు కదా. దీంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు రుషికొండపై నిర్మించిన అతిధి గృహాన్ని అధికారులు, మీడియాతో కలిసి సందర్శించారు.

 

రుషి కొండపైన ఈ కట్టడం, అందులోని సౌకర్యాలను చూసి అంతా అవాక్కయ్యారు. ఇక్కడ రహస్యంగా విలాస భవనాలను కట్టారని, ముందు పర్యాటకం అన్నారు.. తర్వాత పరిపాలన భవనాలు అన్నారని గంటా శ్రీనివాస రావు చెప్పుకొచ్చారు. 450 కోట్ల ప్రజాధనం ఏం చేశారని ప్రశ్నించిన గంటా.. వైసీపీ నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చి దోచుకున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చూపిస్తామని చెప్పిన ఆయన.. ఈ భవనాల విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular