Thursday, August 29, 2024

వారికి రైతు రుణమాఫీ వర్తించదు..

తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబందించి చాలా మందికి అనుమానాలు, సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు వెలువరించినప్పటికీ ఇంకా కొంత కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది. ఐతే అర్హులైన రైతులందరికి రేషన్‌ కార్డు లేకున్నా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

కానీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులకు రుణమాఫీ వర్తించదని ఆయన చెప్పారు. లక్ష రూపాయల జీతం ఉన్నవాళ్లకు రుణమాఫీ కాదని తుమ్మల తేల్చి చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 32 బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వగా, నకిలీ పట్టా పాసుపుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నవారిని గుర్తించింది ప్రభుత్వం. అలాంటి వారివి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 వేల అకౌంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 

ఈ నెల 18న లక్ష రూపాయల లోపు రుణాల మొత్తం 6 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఆగస్టు 15 లోగా మిగతా లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం మొత్తం 31 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. తెల్ల రేషన్‌ కార్డులు లేని రైతుల దగ్గరకు వ్యవసాయశాఖ అధికారులు వెళ్లి పరిశీలించి, అర్హులైతే తప్పకుండా రుణ మాఫీ చేస్తామని చెబుతోంది తెలంగాణ ప్రభుత్వం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

రాష్ట్రంలో హెల్త్ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలి అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా...?
- Advertisment -

Most Popular