Monday, November 18, 2024

‘ఎస్‌.ఐ. యుగంధర్’గా ఆదిసాయికుమార్‌

వెరీ ట్యాలెంటెడ్ ఆది సాయికుమార్‌ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న క్రైమ్-యాక్షన్ థ్రిల్లర్ ‘SI యుగంధర్’. రాకేందు మౌళి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్. పూజా కార్యక్రమంతో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు. ఈ సందర్భంగా మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఆది సాయికుమార్‌ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.
ఈ చిత్రానికి ప్రణవ్ గిరిధరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవోపీ గా రవీంద్రనాథ్.టి పని చేస్తున్నారు. ఎస్‌.జె. శివ కిరణ్ ఎడిటర్, రాజేష్ లంక ఫైట్ మాస్టర్. మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్ డే. వి మిస్ యు సార్. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథని ఈటీవీ విన్ ఓన్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. చాలా మంచి యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారు. మంచి సినిమా చేస్తే ఆదరించడానికిఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి మంచి ప్రయత్నం ఇది. మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే విజయం దానంతట అదే వస్తుంది. ప్రేమకావాలి సినిమాతో ఆది జర్నీ మొదలైంది. 2025 ఆదికి ఒక మంచి కొత్త సంవత్సరం అవ్వాలని మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఒక యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాం. చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని నమ్మకం ఉంది. కంటెంట్ నమ్మి సినిమాని చేస్తున్నాం. ప్రదీప్ గారు చాలా పాషనెట్ ప్రొడ్యూసర్. ఈటీవీ వారికి థాంక్యూ. ఈ సినిమా కథ నచ్చి వాళ్ళు రైట్స్ తీసుకుని సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. 18 నుంచి షూట్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం. లాంచింగ్ ఈవెంట్ కి వచ్చిన సందీప్ కి థాంక్యూ. తను ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్ మేఘలేఖ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఆదితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం’ అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular