బెంగుళూరుకు చెందిన సుయుగ్ వెంచర్స్ ఎల్ఎల్పీ సంస్థ చైర్మన్ శ్రీ యతీష్ సూరినేని ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఆదివారం రూ.1.50 కోట్లు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ అభినందించారు.