Wednesday, January 8, 2025

శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా

ఒకరి మృతి.. 8 మందికి గాయాలు

అయ్యప్ప మండల దీక్ష చేపట్టి శబరిమల దర్శించుకునేందుకు వెళ్తునన హైదరాబాద్‌కు చెందిన అయ్యప్ప భక్తుల బస్సుకు ప్రమాదం జరిగింది. కేరళలోని కొట్టాయం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, 30 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు బోల్తా పడటంతో.. డ్రైవర్‌ రాజు స్పాట్‌లోనే చనిపోయాడు.
కొట్టాయంలోని కన్మల అట్టివాలం సమీపంలో ఘాట్ రోడ్డులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కొట్టాయం నుంచి శబరిమల వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పంబా నదికి 15 కిలోమీటర్ల దూరంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.
కాగా, ఈ దుర్ఘటన గురించి తెలియగానే కేంద్రమంత్రి బండి సంజయ్‌ వెంటనే స్పందించారు. కొట్టాయం జిల్లా కలక్టర్ తో మాట్లాడి గాయపడిన వారిని మెరుగైన చికిత్స అందించాలని బండి సంజయ్ కుమార్ ఆదేశించారు. చికిత్స అనంతరం అయ్యప్ప స్వాములకు స్పెషల్ దర్శనం చేయించేలా ఏర్పాట్లు కూడా చేశారు. చనిపోయిన బస్ డ్రైవర్ దేహాన్ని పోస్టుమార్టం చేయించి ఉచితంగా అంబులెన్సు లో హైదరాబాద్ కి తరలించాలని ఆదేశించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com