Thursday, May 8, 2025

కాంతార2 షూటింగ్‌లో అపశృతి

కన్నడ నటుడు రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది ఈ ప్రీక్వెల్. గతంలో సంచలన విజయం సాధించిన ‘కాంతార’కి మునుపటి కథగా ఈ చిత్రం రాబోతుంది. హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. కానీ అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అనేక సమస్యలు వెంటాడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముందుగా కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడిన ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన గాలి వానతో భారీ ఖర్చుతో వేసిన సెట్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు తాజాగా మరో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్, షూటింగ్ ముగిసిన తర్వాత తన సహచరులతో కలిసి కొల్లూరులోని సౌపర్ణిక నదిలో ఈతకు వెళ్లారు. నీటి లోతు తెలియక నదిలో దిగిన కపిల్ దురదృష్టవశాత్తూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉడిపి జిల్లా బైందూర్ లోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అతడి మృతితో చిత్ర బృందం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇదిలా ఉంటే, ‘కాంతారా’ మొదటి భాగం గురించి చెప్పుకుంటే, ఇది చిన్న సినిమాగా మొదలై, అద్భుత విజయాన్ని అందుకున్న చిత్రం. మొదట కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా, నేషనల్ లెవెల్‌లో క్రేజ్ సంపాదించి తర్వాత తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కేవలం 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com