నేచురల్ బ్యూ టీగా, లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో పాటు మేకప్ లేకుం డా నేచురల్ లుక్ లోకనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి యాక్టింగ్, డాన్స్, లుక్స్ చూసి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్య సరసన తండేల్ మూవీలో నటిస్తుంది. అలాగే హిందీలో రామాయణ్ చిత్రంలో సీత పాత్ర పోషిస్తుంది. సూపర్ నేచురల్డ్యాన్సింగ్, యాక్టింగ్ టాలెంట్ ఉన్న సాయి పల్లవి ఫిదా సినిమాతో ఇక్కడి ప్రేక్షకులకు పరిచయమైంది. తెలంగాణ యాసలో తన పెర్ఫామెన్స్తో అదరగొట్టేసింది. అనంతరం మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు వంటి సినిమాలతో వరుసగా అలరిస్తూ పోయింది. తర్వాత నాగచైతన్యతో కలిసి లవ్స్టోరీతో భారీ హిట్ను అందుకుంది. ! ఈ క్రమంలోనే పలు తమిళ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఆమె చేసిన దియా, మారి 2, అథిరన్, పావ కదైగల్ వంటి సినిమాలు మంచి టాక్నే తెచ్చుకున్నాయి. ఇంకా చెప్పాలంటే టాక్ ఎలా ఉన్నా ఆమె నటనకు ఎప్పటికప్పుడు క్రేజ్ మరింత పెరుగుతూ వచ్చింది. తెలుగులో చివరిగా నానితో శ్యామ్ సింగరాయ్, రానాతో విరాటపర్వం వంటి చిత్రాలు చేసింది. ఇందులో శ్యామ్ సింగరాయ్బాక్సాఫీస్ దగ్గర బాగా ఆడగా, విరాట పర్వం పర్వాలేదనిపించింది. ఇక చివరిగా ఆమె లేడి ఓరియెంటెడ్గార్గి చిత్రంతో అటు తమిళంతో ఇటు తెలుగులో మెప్పించింది.
సాయి పల్లవి 1992లో కోయంబత్తూర్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ అందాల తార 20 ఏళ్ల వయసులో చిన్న పాత్రల్లో నటించడం ప్రారంభించింది. అదే సమయంలో చదువును కూడా కొనసాగించింది. 2015లో “ప్రేమమ్” సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ సక్సెస్‌తో సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలని ఎవరైనా అనుకుంటారు కానీ సాయి పల్లవి అందుకు విభిన్నంగా ఆలోచించింది. మెడికల్ డిగ్రీని పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం జార్జియాలోని టిబిలిసీ (ట్బిలిసి)కి వెళ్లి ంభ్భ్శ్ చదివింది. 2016లో డాక్టర్‌గా అర్హత సాధించాక భారతదేశానికి తిరిగి వచ్చింది.
వైద్య వృత్తిని కొనసాగిస్తూనే, మళ్లీ నటనలోకి ప్రవేశించింది. 2016 నుంచి సాయి పల్లవి “కలి”, “మిడిల్ క్లాసు అబ్బాయి”, “ఫిదా”, “మారి 2”, “అతిరన్”, “లవ్ స్టోరీ”, “శ్యామ్ సింగ రాయ్” వంటి సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. “గార్గి (2022)” చిత్రంలో అద్భుతమైన నటనకు గాను అనేక ఉత్తమ నటి అవార్డులు అందుకుంది. “లవ్ స్టోరీ” సినిమా ఆమెకు కమర్షియల్ హిట్‌ను అందించింది, ఇది బాక్సాఫీస్ వద్ద రూ.60 కోట్లు వసూలు చేసింది. అలా సినిమాల్లో రాణిస్తూ నేడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్స్‌లో ఒకరిగా నిలుస్తోంది
ఇక గార్గి(2022) తర్వాత సాయి పల్లవి మళ్లీ స్క్రీన్పై కనిపించలేదు. కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాల టూర్లకు తిరుగుతూ ప్రొఫెషనల్లైఫ్కు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇక ఈ మధ్యనే ఆమె చెల్లికి కూడా ఎంగేజ్మెంట్అయింది. ఈ హాడావుడిలోనే గడిపేసింది. ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్తో ఓ మూవీ చేస్తోంది. ఇక రీసెంట్గా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో నాగచైతన్యతో కలిసి చేస్తున్న తండేల్ ఒకటి. ఇది సీ అండ్ లవ్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతోంది. త్వరలోనే హిందీలో ఆమిర్ ఖాన్ కొడుకు సినిమాతో అరంగేట్రం ఇవ్వనుంది. సౌత్ లో మోస్ట్ వాంటెంట్ హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. స్కిన్ షో చేయదు… రొమాంటిక్ సీన్స్ లో నటించదు,మరీ పొట్టి బట్టలు వేసుకోదు..అయినా సరే సాయి పల్లవి క్రేజ్ మాత్రం ఓరేంజ్ లో ఉంటుంది. ఆమె కోసం క్యూ కడుతుంటారు మేకర్స్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ ఈ భామ. అద్భుత నటన, ఆకట్టుకునే రూపం ఈ చిన్నదాని సొంతం ఒక్కటే పీస్.. హైబ్రీడ్ పిల్ల. సాయి పల్లవి జన్మదినోత్సవ శుభాకాంక్షలు