టీఎస్, న్యూస్:దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా.. పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు.
దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిర్పూర్ కమిషన్‌ను సుప్రీంకోర్టు నియమించింది. ఈ క్రమంలో సిర్పూర్ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు పలువురిని విచారించింది. చివరకు దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సిర్పూర్ కమిషన్ సూచించింది. అయితే సిర్పూర్ కమిషన్ నివేదిక సరిగ్గా లేదంటూ హైకోర్టులో పోలీసు అధికారులు పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన కోర్టు వారిపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది. దిశా నిందితుల ఎన్కౌంటర్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వీసీ సజ్జనార్ కీలకంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన నేతృత్వంలోనే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందనే ప్రచారం ఉంది.