Friday, December 27, 2024

సలార్​ –2కు సలాం…!!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ప్రశాంత్‌ నీల్‌ షాక్‌..!
‘సలార్‌ 2’ ఇప్పట్లో లేనట్టే..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ప్రస్తుతం సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. చివరగా కల్కీ మూవీలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ రూ.1200కోట్లకుపైగా కలెక్షన్‌ని రాబట్టింది. అయితే, ప్రభాస్‌ అంతకు ముందు సలార్‌ చిత్రంలో కనిపించారు. స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీ బంపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే, సలార్‌ 2 సినిమా కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ప్రశాంత్‌ నీల్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, సలార్‌ 2 ఎప్పుడు షూటింగ్‌ మొదలవుతుందనే స్పష్టత లేదు.

అయితే, ఈ లోగా సలార్ మేకర్స్‌ హోంబలే ప్రొడక్షన్‌ ప్రభాస్‌తో మరో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్‌. ఆదిపురుష్‌ మూవీని తెరకెక్కించిన ఓం రౌత్‌తో ప్రభాస్‌ సినిమా ఉండబోతుందని ఫిలిం నగర్‌లో వార్త చక్కర్లు కొడుతున్నది. ప్రస్తుతం సలార్‌ 2 మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫాన్స్‌కు పెద్ద షాక్‌ ఇచ్చినట్లయ్యింది. అటు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. హీరో ప్రభాస్‌ మరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. దాంతో ఇక ఇప్పట్లో సలార్‌ 2 పట్టాలెక్కే అవకాశాలు లేవని తెలుస్తుంది. హోంబలే ప్రొడక్షన్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు సలార్‌ మంచి హిట్‌ని అందించింది. వాస్తవానికి సలార్‌ 2 మూవీలోనే స్టోరీ ఉండడంతో భారీ అంచనాలున్నాయి.
ఈ క్రమంలో అభిమానులు అప్‌డేట్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ 2ని పక్కనపెట్టి మరో హీరోతో ఎందుకు సినిమా చేస్తున్నాడనే అభిమానులు తలలుపట్టుకుంటున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌తో తీయబోయే మూవీ సైతం రెండు భాగాలుగా రానున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ప్రభాస్‌ మంచు విష్ణు కన్నప్ప మూవీలో అతిథిపాత్రలో నటిస్తున్నారు. అలాగే, మారుతీ దర్శకత్వంలో ‘రాజాసాబ్‌’, యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’తో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కల్కి మూవీకి సీక్వెల్‌గా కల్కి 2 తీయనున్నారు. ఈ మూవీలో వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభించి 2026లో విడుదల చేసే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తున్నది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com