Thursday, April 3, 2025

రష్మికకి సల్మాన్‌ సెక్యూరిటీ

సల్మాన్‌ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ సికందర్‌. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు మన కండల వీరుడు. ప్రమోషన్స్‌లో రష్మికతో పాటు పోటీగా ఆయన కూడా హంగామా చేశాడు. అయితే ఈ షెడ్యూళ్ల న‌డుమ ర‌ష్మిక తిరుగు ప్ర‌యాణ‌మ‌వుతున్న‌ప్పుడు రష్మిక మందన్నకు హ‌గ్ ఇచ్చి, ఆమె కోసం కారు తలుపు తెరిచి తన విన‌మ్ర‌త‌ను చాటుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఏ.ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికంద‌ర్ భారీ మాస్ యాక్ష‌న్ చిత్రం. ఈ చిత్రానికి విమర్శకులు – అభిమానుల నుండి మిశ్ర‌మ‌ సమీక్షలు వచ్చాయి. స‌ల్మాన్ భాయ్ కి ఇది ఊహించ‌ని షాక్. అయినా భాయ్ స్టార్ డ‌మ్ దృష్ట్యా ఆరంభ వ‌సూళ్ల‌కు కొద‌వేమీ లేద‌ని ట్రేడ్ చెబుతోంది. ఒక స‌మావేశం నుంచి తిరిగి వ‌స్తూ…. స‌ల్మాన్ క‌లీనా విమానా శ్ర‌యం నుంచి క‌ట్టు దిట్ట‌మైన సెక్యూరిటీ న‌డుమ వెలుప‌లికి చేరుకున్నాడు. అదే స‌మ‌యంలో ర‌ష్మిక‌కు త‌గిన భ‌ద్ర‌త‌ను భాయ్ క‌ల్పించాడు. త‌న కార్ డోర్ తెరిచి సాగ‌నంపాడు. కారులోకి ప్రవేశించే ముందు, రష్మిక సల్మాన్ ఖాన్‌ను ముద్దుగా కౌగిలించుకుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com