తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల వేళ మరో కీలక నియామకం చేపట్టింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల చైర్మన్‌గా సామ రామ్ మోహన్ రెడ్డిని నియమించారు. టిపిసిసి చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, సామ రామ్మోహన్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధిగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆయన చురుకుగా ఉంటారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది.