- ఎప్పుడూ వెన్నంటే ఉంటావ్..
- తండ్రిపై సమంత ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సమంత ఇప్పటికే ఎన్నో సమస్యలతో సతమతమవుతుండగా.. ఇప్పుడు మరో విషాదం ఆమెను చుట్టుముట్టింది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. “నాన్నను ఇక కలవలేను” అంటూ పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీ ని షేర్ చేసి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఇక సమంతకు సానుభూతి తెలియజేస్తూ అభిమానులు సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.
నాన్న లేరు
సమంత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె త్రండి జోసెఫ్ ప్రభు కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఇక సమంత కూడా తన ఇన్‌స్టా వేదికగా ఇదే విషయాన్ని తెలిసయజేసింది. బ్రోకెన్ హార్ట్ ఎమోజీతో.. అంటిల్ విల్ మీట్ ఎగైన్ డాడ్ అంటూ… స్టేటస్‌ను పోస్ట్ చేసింది. ఇక మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే సమంత ఫాదర్ జోసెఫ్… సమంత విడాలకులు తీసుకున్న టైంలో మాత్రం మీడియాతో మాట్లాడారు. కాస్త ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక జోసెఫ్ ప్రభును తన కూతురిని అమితంగా ప్రేమిస్తుంటారు. ఆమె కోరుకున్న రంగంలో రాణించేందుకు చాలా సపోర్ట్ చేశారు. ఇదే విషయాన్ని గతంలో సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. సమంత తన తండ్రి మరణించినట్టు ఇంస్టాగ్రామ్ లో అధికారికంగా వెల్లడించింది. కానీ ఆయన ఏ కారణాల చేత మరణించారు అనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు. ఈ విషయం తెలుసుకున్న సమంత అభిమానులు..
సమంతకు ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో మరింత ధైర్యంగా ఉండాలని ఆమెకు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనా సమంత తండ్రి మరణించడంతో ఉన్న తోడు కూడా కోల్పోయింది అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. జోసెఫ్ ప్రభు మృతిని తెలియజేస్తూ సామ్ తన ఇన్ స్టా లో స్టేటస్ పెట్టారు. హార్ట్ బ్రోకెన్ ఇమేజ్ ను షేర్ చేశారు. అంటిల్ వీ మీట్ ఎగైన్ డాడ్.. అంటే మళ్లీ మనం కలిసే వరకు నాన్న అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టారు. సమంత చెన్నైలో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి, తెలుగు ఆంగ్లో-ఇండియన్. తన జీవితంలో తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారని చాలా సందర్భాల్లో చెప్పారు.
సినిమాలతో బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులను మాత్రం ఎప్పటికప్పుడు కలిసేది. తాను కెరీర్ లో ఈ స్థాయికి ఎదిగానంటే.. దానికి కారణం తన తండ్రే అని అన్నారు. సమంత తండ్రి మరణవార్త తెలిసి.. సమంత అభిమానులు షాకయ్యారు. సమంత తండ్రికి నివాళులర్పిస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మీ కుటుంబానికి ప్రగాడ సానుభూతి అంటూ వాటిని షేర్ చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. ఈ విషయం తెలిసి.. సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
నాన్నే ధైర్యం
“నా మొదటి సినిమా ఏ మాయ చేసావే పెద్ద హిట్ అయ్యి, జనాలు నన్ను మెచ్చుకుంటున్నప్పుడు, ఆ విజయాన్ని ఎలా తీసుకోవాలో నాకు తెలియదు. ఆ విజయంలో నా మనసులో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మీరు అండర్ అచీవర్, లేదా మీరు ఈ విజయం, ప్రశంసలన్నింటికీ అర్హులు కాదు అని అన్నారు. ఆ రెండో మాటనే మనసులో పెట్టుకున్నాను. కెరీర్ మొదట్లో నా లుక్స్, యాక్టింగ్ విషయంలో నాపై నాకే అనుమానం కలిగింది. నేను ఈ ప్రశంసలకు అర్హురాలిని అని నన్ను నేను ఒప్పించుకోవడానికి 10-12 సంవత్సరాలు పట్టింది. ఆ సమయంలో మా నాన్న జోసెఫ్ ప్రభు మాటలు నన్ను మరింత బలంగా మార్చాయి. ఇండస్ట్రీలో, నా జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలకు మా నాన్న అండగా ఉన్నారు ” అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.