Thursday, December 26, 2024

సమంతను వెనక్కునెట్టిన శోభిత… నిజజీవితంలోనేకాదు?

మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల చేసిన ఐఎండీబీ
ఐదో స్థానంలో శోభిత, ఎనిమిదవస్థానంలో సమంత
టాపర్‌గా త్రిప్తిడిమ్రీ

మోస్ట్ పాపులర్ నటీమణుల జాబితాలో శోభిత ధూళిపాళ ప్రముఖ నటిగా నిలిచారు. గతంలో సమంతనే ముందు ఉండేది అలాంటిది సమంతను వెనక్కి నెట్టారు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ ఐఎండీబీ విడుదల చేసిన జాబితాలో శోభిత ఐదో స్థానంలో ఉండగా సమంత ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ‘బ్యాడ్‌ న్యూజ్‌’, ‘లైలా మజ్ను’ రీరిలీజ్‌ ‘భూల్‌ భులయ్యా 3’ సినిమాలు విడుదలైన నేపథ్యంలో త్రిప్తి డిమ్రీ ఈ జాబితాలో టాపర్ గా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 250 మిలియన్ సందర్శకుల వాస్తవ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు ఐఎండీబీ వెల్లడించింది.

ఈ జాబితాలో రెండో స్థానంలో దీపికా పదుకొణే, మూడో స్థానంలో ఇషాన్ ఖత్తర్, నాలుగో స్థానంలో షారుక్ ఖాన్ నిలిచారు. ఐదో స్థానంలో శోభిత ధూళిపాళ ఉన్నారు. చైతూతో పెళ్లితో పాటు ఆమె నటించిన మంకీ మ్యాన్ విడుదల సందర్భంగా నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా సెర్చ్ చేశారని ఐఎండీబీ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా శార్వరీ, ఐశ్వర్య రాయ్ ఉండగా ఎనిమిదో ర్యాంక్ ను సమంత దక్కించుకున్నారు. సమంత నటించిన ‘సిటడెల్‌: హనీ బన్నీ’ విడుదల, హీరోయిన్ అనారోగ్యం తదితర కారణాలతో నెటిజన్లు ఆమె కోసం ఎక్కువగా వెతికారని ఐఎండీబీ వెల్లడించింది.

ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే… నిజజీవితంలోనే కాక ఆఖరికి ఇంద్రజాలంలో శోభిత సమంతను వెనక్కు నెట్టేసిందని సోషల్‌ మీడియాలో కామెంట్లు వినబడుతున్నాయి. చైతూ జీవితంలోకి శోభిత రావడంతో ఇక సమంత చైతూ కలిసే సమస్యలేదని తేలిపోయింది. ఒకానొక సందర్భంలో మళ్ళీ వీరిద్దరూ కలుస్తారేమో అన్న అనుమానాలు కాస్తో..కూస్తో ..ఫ్యాన్స్‌లో ఉండేవి. ఇప్పుడు చైతూ, శోభితల వివాహ బంధంతో అలాంటి గాసిప్ రాయుళ్ళ నోళ్ళు మూతబడ్డాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com