Saturday, March 22, 2025

సమంతకు ‘హనీ-బన్నీ’ అవార్డ్‌

సమంత నటన గురించి అందరికీ తెలసిందే. ఏ పాత్రనైనా సరే అలవోకగా నటించేస్తది. తెలుగులోనే కాదు, హిందీ, తమిళం వంటి ఇతర భాషల్లోనూ ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల కాలంలో ఆమె తెలుగులో నటించిన సినిమాలు ఏవీలేవు. అయినప్పటికీ వెబ్ సిరీస్ ల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉంది. అమ్మడి క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా సమంతకు ఓటీటీలో ఉత్తమ నటి అవార్డు లభించింది. ‘హనీ-బన్నీ’ సిరీస్‌లో అద్భుతమైన నటన కనబరిచినందుకు ఒక ప్రముఖ మీడియా సంస్థ ఆమెను ఈ పురస్కారంతో సత్కరించింది. ఈ అవార్డును అందుకోవడం పట్ల సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రతికూల పరిస్థితుల నడుమ ‘హనీ-బన్నీ’ సిరీస్‌ను పూర్తి చేయడమే తనకు ఒక అవార్డు అని సమంత పేర్కొంది. తనను నమ్మిన వారందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపింది. రాజ్ అండ్ డీకే, వరుణ్ ధావన్‌ల వల్లే తాను ‘సిటాడెల్ హనీ-బన్నీ’ని పూర్తి చేయగలిగానని సమంత చెప్పింది. సిరీస్‌ను పూర్తి చేయడానికి వారు ఎంతో ఓపికతో వ్యవహరించారని, తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com