Wednesday, November 27, 2024

గట్టోడినే పట్టిందిగా? – కపూర్‌ కుటుంబంలోకి సమంత

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరు సమంత. ఈమె కేవలం టాలీవుడ్‌ మాత్రమే కాదు హాలీవుడ్‌.. బాలీవుడ్‌లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ప్రస్తుతం హనీబన్నీ వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో మాఇంటి బంగారం పేరుతో సొంత బ్యానరులో ఓ సినిమా చేస్తోంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత ఒంటరిగానే జీవిస్తున్న సమంత మయోసైటిస్ కు గురవడంతో ఏడాదిన్నరకు పైగా సినిమాలకు దూరంగా ఉంది. తర్వాత సినిమాల్లో ఆఫర్లు రావడంలేదని బహిరంగంగానే చెప్పింది. రెండో పెళ్లి చేసుకుంటారా? అనే ప్రశ్న సమంతకు పలుసార్లు ఎదురైనప్పటికీ చేసుకోనని, ఆ ఉద్దేశం లేదని, ఒంటరిగానే జీవిస్తానని చెబుతూ వస్తోంది. మలైకాకు బ్రేకప్ చెప్పిన అర్జున్ కపూర్ ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరలవుతోంది. బాలీవుడ్ హీరోతో ప్రేమాయణంలో ఉందని, త్వరలోనే ఆ హీరోను వివాహం చేసుకొని వారి ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టబోతోందనేది ఆ వార్త సారాంశం. ఆ హీరో ఎవరో కాదు.. మలైకా అరోరాతో ప్రేమాయణం నడిపిన అర్జున్ కపూర్. ప్రముఖ నిర్మాత బోనీకపూర్ కొడుకైన అర్జున్ కపూర్ ఇటీవలే మలైకా అరోరాకు బ్రేకప్ చెప్పాడు. ఆ బ్రేకప్ చెప్పడానికి కారణం సమంతను వివాహం చేసుకోవాలన్న నిర్ణయమే అన్నది వైరలవుతున్నది. మైలైకాతో విడిపోయిన కొద్ది రోజులకే అర్జున్ కపూర్ సమంతతో ప్రేమలో పడ్డాడని, వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే సమంత తన అకౌంట్ లో ఓ మంచి కవితను షేర్ చేసింది. దీనికి అర్జున్ కపూర్ రిప్లై ఇచ్చాడు. ఈ కవిత చాలా ఆదర్శనీయంగా ఉందన్నాడు. వీరిద్దరి మధ్య ఇప్పుడు కాదని, గతం నుంచే పరిచయం ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. సాధారణంగా అర్జున్ కపూర్ ఆ పోస్ట్ కు రిప్లై ఇచ్చారా? లేదంటే గతం నుంచే వీరిమధ్య పరిచయం ఉందా? పెళ్లి విషయం నిజమేనా? ఎప్పుడు జరగుతోంది? అనే విషయాలపై స్పష్టత రావాలనే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular