Thursday, December 26, 2024

సిటాడెల్‌లో సమంత కష్టాలు

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న సిటాడెల్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో వెబ్ సిరీస్ టీమ్.. ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది. అయితే సమంత కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఆ సమయంలో తన చేతిలో ఉన్న సిటాడెల్ సిరీస్ తో పాటు పలు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఆమె.. విదేశాలకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని రీసెంట్ గా ఇండియాకు వచ్చేశారు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమయంలోనే ఆమె సిటాడెల్ షూట్ లో పాల్గొన్నారు. అప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే పలుమార్లు సమంత తెలిపారు. ఇప్పుడు ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్ మాట్లాడారు. సిటాడెల్ షూటింగ్ సమయంలో సమంత.. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అసలేం ఏమవుతుందో తమకు అర్థం కాలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత.. సామ్ మయోసైటిస్ బారిన పడినట్లు తెలిసిందని చెప్పారు. అనేక సార్లు.. సమంత కోసం తాము వెయిట్ చేసేవాళ్లమని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె బాగా లేట్ గా సెట్స్ కు వచ్చేవారని.. స్పృహ తప్పి పడిపోయారా లేదా ఇంకేమైందో తెలిసేది కాదని రాజ్ తెలిపారు. అదే ఇంటర్వ్యూలో సమంత వర్క్ కమిట్మెంట్ వేరే లెవెల్ లో ఉంటుందని వరుణ్ ధావన్ కొనియాడారు. ఎన్ని సమస్యలు ఎదురైనా.. వాటిని గట్టిగా ఎదుర్కొని సమంత షూట్ కంప్లీట్ చేశారని చెప్పారు. సమంత అద్భుతమైన నటి అని, చాలా ప్రొఫెషనల్‌ గా ఉంటారని పేర్కొన్నారు. ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారని వరుణ్ అన్నారు. యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ గా తెరకెక్కిన సిటాడెల్ లో స్పై ఏజెంట్ గా సమంత కనిపించనున్నారు. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి ప్రశంసలు అందుకున్నారు. మరి స్పై క్యారెక్టర్‌లో సమంత ఏ విధంగా కనిపించబోతుంది అన్నది వేచి చూడాలి. ఇకపోతే సమంత విషయానికి వస్తే తను ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com