Monday, April 21, 2025

రెండోపెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌

టాలీవుడ్ టాప్‌ హీరోయిన్‌ సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో హిట్‌ సినిమాలు కూడా వచ్చాయి. నాగ చైతన్య, సమంతలు 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత ఒంటరికి ఉంటున్నారు. నాగ చైతన్య శోభితను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. సమంత రెండో పెళ్లి గురించి కూడా అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి. సమంత ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ స్టార్ దర్శకుడు మరెవరో కాదు.. రాజు నిడుమోరు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన సిటాడెల్ సినిమాకు సైతం రాజు నిడుమోరునే దర్శకత్వం వహించారు. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగానే ఈ జంట కలిసి దర్శనం ఇస్తున్నారు. ఆదివారం సమంత తిరుమలకు వెళ్లిన సమయంలో కూడా రాజు నిడుమోరు ఆమెతోనే ఉన్నారు.

 

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com