‘ఏమాయ చేశావే” సినిమాతో హీరోయిన్‌గా పరిచియం అయిన సమంత.. మహేష్ బాబుతో నటించిన ”దూకుడు” సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది. టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని మాత్రం ఎక్కడా కూడా చెప్పడం లేదు. సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త నెట్టింట సంచలనంగా మారింది. గత కొంతకాలంగా సమంత బాలీవుడ్‌లో ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌కు రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. వీరిద్దరు తరచుగా దర్శనం ఇస్తున్నారు. ఇటీవలే వీరిద్దరు తిరుమలలో కూడా కలిసి కనిపించారు. దీంతో వీరిద్దరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ సాగింది. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో దర్శకుడు రాజు నిడుమోరు ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలకు ”ఇది చాలా పొడవైన మార్గం, కానీ ఇక్కడ మేము ఉన్నాము. న్యూ బిగినింగ్స్” అని రాసుకొచ్చింది. అంతేకాకుండా హార్ట్ సింబల్స్ కూడా జత చేసింది. దీంతో వీరిద్దరి రిలేషన్ నిజమే నెటిజన్లు భావిస్తున్నారు. కాబోయే భర్తను ఈ విధంగా సమంత పరిచయం చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.