Thursday, December 26, 2024

‘శంబాల’ రెగ్యులర్ షూటింగ్

ప్రస్తుతం మేకర్లు అంతా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ నూతన ప్రపంచంలోకి ఆడియెన్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని తీస్తున్నారు. డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రయోగాలు చేస్తున్న ఆది సాయి కుమార్ హీరోగా.. ‘ఏ’ యాడ్ ఇన్‌ఫినిటిమ్ ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘శంబాల’. శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అయింది. ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇండియన్ స్క్రీన్ మీద ఇది వరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో శంబాల చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి ఖర్చులకు రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ముఖ్యంగా విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com