Wednesday, May 7, 2025

“ఆదిశక్తి” సేవా సంస్థను లాంఛ్ చేసిన సంయుక్త

స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపింది. “ఆదిశక్తి” సేవా సంస్థను లాంఛ్ చేసిన హీరోయిన్ సంయుక్త.

స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది.

మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడపాలనే లక్ష్యంతో ఆదిశక్తి సంస్థను స్థాపించింది సంయుక్త. అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ చేయూతనివ్వనుంది. విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో మహిళలకు సపోర్ట్ గా నిలవనుంది ఆదిశక్తి సంస్థ. మహిళలు ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది ఆదిశక్తి సంస్థ ఉద్దేశమని సంయుక్త తెలిపింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com