Saturday, April 19, 2025

Sanatnagar Inspector Abuse: చాలా అందంగా ఉన్నావు చెప్పినచోటికి వస్తావా..?

  • గోడు చెప్పుకునేందుకు వచ్చిన మహిళతో సీఐ వ్యాఖ్యలు
  • బదిలీ​ చేసిన సీపీ

జనాల మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన ఓ ఖాకీ ట్రాక్ తప్పాడు. తన గోడు చెప్పుకునేందుకు వచ్చిన లేడీ నంబర్‌ తీసుకుని అసభ్య మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలు విషయాన్ని.. సీపీ దృష్టికి తీసుకెళ్లింది. ఓ సమస్య గురించి ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ మహిళ కంప్లైంట్​ చేసిన తర్వాత సీఐ ఆమె ఫోన్​ నంబర్ తీసుకున్నాడు. అక్కడి నుంచి ఇన్‌స్పెక్టర్‌ ఆమెకు అసభ్య మెసేజ్‌లు చేశాడు. దీంతో బాధితురాలు.. సీపీకి కంప్లైంట్ చేయడంతో.. అతని ఉద్యోగానికి ఎసరు వచ్చింది.

సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ పురేందర్‌ రెడ్డి ఆ స్టేషన్​కు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోలీస్‌స్టేషన్ లో కంప్లైంట్ చేసిన మహిళతో ఇన్‌స్పెక్టర్‌ అసభ్య చాటింగ్‌ చేశాడు. బాధితురాలు ఇది తప్పని వారించి.. సీఐ బాగోతాన్ని సిటీ కమిషర్ ముందు ఏకరవు పెట్టుకుంది. చాలా అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేసుకు రా అంటూ అతడు పెట్టిన అసభ్య మెసెజ్‌ల తాలూకా ఆధారాలను కూడా అందజేసింది.

దీంతో సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్‌ ప్రవర్తనపై సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సైబరాబాద్‌ సీపీ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీసు అధికారులు, సిబ్బంది.. స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా మెలగాలని, తప్పుగా వ్యవహరిస్తే.. వేటు పడుతుందని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు. పోలీస్ శాఖకు గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com