మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’ షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్‌లోని పిసిఎక్స్ స్క్రీన్‌లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్‌ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్‌లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్‌ను మాన్‌స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు.
‘నేనెవరినో, అసలు ఎక్కడి నుంచి వచ్చానో, నాకీ సమస్య ఎప్పటినుంచి వుందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావడం లేదు’ అని విశ్వక్ సేన్‌తో తనను తాను ప్రశ్నించుకునే సన్నివేశంతో ట్రైలర్‌ను ఓపెన్ అవుతుంది. కొందరు అఘోరాలు అతన్ని రక్షిస్తారు. వారు తమ మేలు కోసం ఆ ఆశ్రమాన్ని విడిచిపెట్టమని అడుగుతారు. తన వ్యాధికి ఎక్కడ మందు దొరుకుతుందో మాస్టర్ వివరాలు తెలియజేస్తాడు. అతను గడువులోపు హిమాలయాలలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి చాలా దూరం ప్రయాణించాలి, లేకపోతే అతను మరో 36 సంవత్సరాలు వేచి ఉండాలి. మరోవైపు, ఏకకాలంలో ఒక దేవదాసి, ఒక శాస్త్రవేత్త తన క్లినికల్ ట్రయల్స్ చేస్తున్న మరో రెండు కథలు కూడా చూపించారు.
ట్రైలర్ ప్రధాన పాత్రల ప్రయాణాన్ని చూపిస్తుంది, ప్రతి కథ దాని అద్భుతంగా ఉంది. మానవ స్పర్శను అనుభవించలేని సమస్య ఉన్న విశ్వక్ సేన్ కథ, అతని జర్నీ అద్భుతంగా వుంది. తన పాత్రను బ్రిలియంట్ గా పోషించాడు. ఇది అతనికి ఇప్పటి వరకు చాలెజింగ్ గాఉన్న పాత్రలలో ఒకటి. విశ్వక్ దానిని ఎంతో నైపుణ్యంగా చేశాడు. చాందినీ చౌదరి కథానాయికగా నటించింది, ఆమె నివారణను కనుగొనడంలో హీరోకే సహాయం చేస్తుంది. ఎంజీ అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్ కీలక పాత్రల్లో కనిపించారు.
దర్శకుడు విద్యాధర్ కగిత ఒక విలక్షణమైన కాన్సెప్ట్‌ని రేసీ స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా మలిచాడు. విశ్వనాథ్ రెడ్డి తీసిన విజువల్స్ అద్భుతంగా ఉండగా, నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథనానికి మరింత ఇంపాక్ట్ ని ఇచ్చింది. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకుంది. కార్తిక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ ప్రజెంట్ చేస్తోంది. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే రాశారు.మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై షోరీల్ ట్రైలర్ చాలా క్యూరియాసిటీని పెంచింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బావుంది. చాలా అరుదైన సినిమా ఇది. ఆరేళ్ళు పాటు ఒక సినిమాని అంకితభావంతో చేయడం మామూలు విషయం కాదు. యాక్టర్స్, డైరెక్టర్, నిర్మాతలకు చాలా పాషన్ వుంటేనే ఇది సాధ్యమౌతుంది. మేకప్ అందుబాటులో లేనప్పుడు విశ్వక్ స్వయంగా మేకప్ చేసుకున్న సందర్భాలు వున్నాయి. సౌండ్ డిజైన్ కలర్ గ్రేడింగ్ చాలా టెర్రిఫిక్ గా వున్నాయి. థియేటర్స్ లో చూసేటప్పుడు మంచి ఎక్స్ పీరియన్స్ వస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. కథని చాలా డిఫరెంట్ గా చెప్పారు. టీం అందరికీ గుడ్ లక్. మార్చి 8న తప్పకుండా చూడండి.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ…ఏడాది పూర్తి కాకముందే మరో సినిమాతో రావడం చాలా ఆనందంగా వుంది. గామి మొదలుపెట్టినప్పుడు సరిగ్గా నా పేరుకు మీకు తెలీదు. దర్శకుడు విద్యాధర్ విజన్ ని బలంగా నమ్మాము. అన్ని సినిమాలు వేరు ఈ సినిమా ఇచ్చిన కిక్ వేరు. చిన్న టీంతో మొదలుపెట్టి ఈ రోజు ఇంత బిగ్ స్క్రీన్ లో ట్రైలర్ చూడటం చాలా ఆనందంగా వుంది. ఇందులో మాస్ డైలాగులు, విజల్ కొట్టే ఫైట్స్, ఐటెం సాంగ్స్ వుండవు. కానీ ఇవన్నీ ఇచ్చే ఫీలింగ్ సెకండ్ హాఫ్ లో వుంటుంది. ప్రతి తెలుగు ఫిల్మ్ మేకర్ గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఈ సినిమా వర్క్ అవుట్ అయితే చాలా మంది కొత్త ఫిల్మ్ మేకర్స్ వస్తారు. దర్శకుడు చాలా కష్టపడ్డాడు. వంశీ గారికి ధన్యవాదాలు. ఇండియన్ ఆడియన్స్ కి యాక్టింగ్ చేయకుండా హీరో అయిన డైరెక్టర్ సందీప్ అన్న.( నవ్వుతూ) తెలుగోళ్ళు కాలర్ ఎత్తుకునేలా చేసి డైరెక్టర్ తను. సందీప్ అన్న ట్రైలర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. కార్తిక్ అండ్ క్రౌడ్ నుంచి ఫండ్ చేసిన అందరికీ చాలా చాల థాంక్స్. మార్చి 8 థియేటర్స్ కి రండి కొత్తగా ర్యాంప్ అవుతుంది” అన్నారు.