Friday, May 16, 2025

బిఆర్‌ఎస్ నుంచి 25 మంది, బిజెపి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు…

  • కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిజెపి మోసం చేసింది
  • సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

త్వరలోనే బిఆర్‌ఎస్ పార్టీ నుంచి 25 మంది, బిజెపి నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ బలం 90కి పెరుగుతుందని తమ ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్ట్ సంక్షోభం తప్పదని బిజెపి ఎంపి లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంగళవారం గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.

యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిజెపి మోసం చేసిందని ఆయన జగ్గారెడ్డి పేర్కొన్నారు. బిజెపి దేవుడి పేరు చెప్పి ఓట్లు అడిగిందన్నారు. గాంధీ కుటుంబానికి మోసం అంటే తెలియదని జగ్గారెడ్డి తెలిపారు. హామీలు ఇచ్చి ఎగనామం పెట్టడంలో బిజెపి నాయకులని మించిన వారు ఉండరని ఆయన సెటైర్లు వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎక్కడా అధికార దుర్వినియోగం జరగ లేదని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఎన్నికలు జరిపించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయిందన్నారు. బిజెపి ఎంపి లక్ష్మణ్ కామెంట్స్ అర్థరహింతంగా ఉన్నాయని జగ్గారెడ్డి విమర్శించారు. ఇక ఎపి రాజకీయాలపై ఫలితాల వెల్లడైన తరువాత మాట్లాడుతానన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com