Wednesday, November 27, 2024

సానియాకు మళ్ళీ పెళ్లి

టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌గా భారతదేశంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాప్‌ ప్లేయర్‌ సానియా మీర్జా. ఈమె వివాహం చేసుకుని ఏవో కొన్ని కారణాలవల్ల భర్తతో విడవిపోవడం జరిగింది. ఇక వారిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన కుమారుడితో కలిసి హైదరాబాద్‌లో నివశిస్తుంది. షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సానియా రెండో వివాహం చేసుకోవాలని పలు సోషల్‌ మీడియాలో ఆమెకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. 14 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. వేరే అమ్మాయితో షోయబ్ మాలిక్ ప్రేమలో ఉండటంవల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడాకులకు కారణమైందని వార్తలు వచ్చాయి. ఎంతోమంది సలహా ఇచ్చారు సానిమా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలంటూ ఆమె సన్నిహితులు. అయితే ఆమె తన కుమారుడితో కలిసి జీవించడానికే మొగ్గుచూపుతోంది. ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని రెండో పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయికానీ సానియా తండ్రి వాటిని ఖండించారు. షమీ కూడా తన భార్య జహాన్ కు విడాకులిచ్చారు. అయితే సానియా ఒంటరిగా ఉండొద్దని రెండో పెళ్లి చేసుకోవాలంటూ పాకిస్తాన్ కు చెందిన నటుడు నబీల్ జాఫర్ గతంలోనే వ్యాఖ్యానించారు. విడాకులు తీసుకున్న సమయంలో సానియా మీర్జా… విడాకులు తీసుకున్న తర్వాత రెండోపెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా ఉంటే సరిపోదా? అని వ్యాఖ్యానించింది. “సానియా మీర్జా రెండో పెళ్లి? వరుడు తెలుగు స్టార్ హీరోనా?” ఎవర్ని చేసుకున్నా పర్వాలేదు టీవీ కార్యక్రమంలో యాంకర్ జాఫర్ ను ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని సమాధానమిచ్చాడు. ‘కొత్త జీవితం ప్రారంభించాలి’ అంటూ సానియా మీర్జా పోస్ట్ చేసింది. దీనికి బదులుగా ఓ నెటిజన్ సానియా రెండో పెళ్లి చేసుకోవాలని, కానీ ముస్లిం వ్యక్తిని మాత్రం చేసుకోవద్దన్నాడు. అతను ఇచ్చిన సలహాకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular