Friday, July 5, 2024

యాంటీ డ్రగ్స్ యాడ్ కు దర్శకత్వం వహించిన సంజీవ్ రెడ్డి

డ్రగ్స్ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో కోసం యాంటీ డ్రగ్ యాడ్ ను తయారుచేసింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. ఈ యాడ్ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రిలీజైంది. ఈ యాడ్ ను టామాడ మీడియా ఎగ్జిక్యూట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ యాడ్ గురించి ట్వీట్ చేస్తూ డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్ ను తెలంగాణలోని ప్రతి థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. డ్రగ్స్ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్ రెడ్డి. డ్రగ్స్ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎలాంటి సపోర్ట్ అందిస్తుందో ఈ యాడ్ లో ఎఫెక్టివ్ గా చూపించారు సంజీవ్ రెడ్డి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular