విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధికార సంస్థ చైర్మన్ (శాప్) రవినాయుడు, రాష్ట్ర రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నియమితులైన రవినాయుడుని మంత్రి శాలువతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం పలు క్రీడా అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పోలవరం నియోజకవర్గ టిడిపి యూత్ అధ్యక్షులు.సురేంద్రనాథ్ చౌదరి, అనంతం అనంతపురం టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి బాల లోకేష్ యాదవ్, తెలుగు యువత అధికార ప్రతినిధి చీరాల నరేష్ ఉన్నారు.