Monday, April 21, 2025

ప్రాణస్నేహితులే…తోడికోడళ్ళా..

జాన్వీ క‌పూర్ -సారా అలీఖాన్ ఒకే ఇంటికి కోడ‌ళ్లుగా అడుగు పెట్ట‌బోతున్నారా? ప్రాణ స్నేహితులుగా ఉన్న ఆ ఇద్దరు తోటి కోడ‌ళ్లు కాబోతున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం బాలీవుడ్ మీడియాలో ఠారెత్తిపోతుంది. జాన్వీ-సారా ఎంత క్లోజ్ ప్రెండ్స్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు బాల్యం నుంచే స్నేహితులు. ప‌క్క‌ప‌క్క‌నే ఇళ్లు కూడా. అలా ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచే స్నేహితులుగా మారారు. అటుపై ఒకే స్కూల్ …ఒకే కాలేజీ లో చ‌దువుకోవ‌డం అన్నీ వాటంత‌ట‌వి అలా జ‌రిగిపోయాయి. చివ‌రికి సినిమాల్లో లాంచ్ అవ్వ‌డం కూడా ఒకేసారి జ‌రిగింది. ప్ర‌స్తుతం యువ భామ‌లిద్ద‌రు బాలీవుడ్ లో దూసు కుపోతున్నారు. కెరీర్ ప‌రంగా ఎలాంటి ఢోకాలేదు. తెలివైన భామ‌లేన‌ని ఇప్ప‌టికే ప్రూవ్ చేసారు.

ఇక వీరిద్ద‌రి ప్రేమ క‌హానీల్లోకి వెళ్తే ఇద్ద‌రు ప్రీ ప్లాన్డ్ గానే ఒకే ఇంటికి కోడ‌ళ్లుగా వెళ్లే ప్లాన్ లోనూ ఉన్న‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం జాన్వీ క‌పూర్- శిఖ‌ర్ ప‌హారియాతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు మీడియాలో ఇప్ప‌టికే లీకైంది. ఇద్ద‌రు జంట‌గా చిక్కిన సంద‌ర్భాలు..వీడియోలు చూస్తే అది స్నేహం కాదు ప్రేమ అని దాదాపు క‌న్ప‌మ్ అయింది. శిఖ‌ర్ ప‌హారియాకి జాన్వీ ఎంత ప్ర‌యార్టీ ఇస్తుంద‌న్న‌ది ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఈ జంట వివాహ బంధంతో ఒక‌ట‌వుతార‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. స‌రిగ్గా ఇదే వేడిలో సారా అలీఖాన్ కూడా జాన్వీ క‌పూర్ ప్రేమించిన శిఖ‌ర్ ప‌హారియా సోద‌రుడితో ల‌వ్ లో ఉన్న‌ట్లు వెలుగులోకి వ‌స్తోంది. సారీ అలీఖాన్ వీర్ ప‌హారియాతో ల‌వ్ లో ఉన్న‌ట్లు బాలీవుడ్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇద్ద‌రి మ‌ధ్య చాటు మాటుగా ఈ వ్యవ‌హారం కొన్ని నెల‌లుగా సాగుతుందని లీక్ అవ్వ‌డం సంచ‌ల‌నంగా మారింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలి. ఒక‌వేళ స్నేహితురాళ్లు ఇద్ద‌రు బ్ర‌దర్స్ ని పెళ్లి చేసుకుంటే గ‌నుక ఒకే ఇంటికి తోడి కోడ‌ళ్లుగా వెళ్తారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com