Wednesday, April 2, 2025

తెలుగువారు నటించిన పరిపూర్ణమైన ‘సారంగపాణి జాతకం’ – దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ

ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ సినిమా ఏప్రిల్ 18న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ, ‘‘శివలెంక కృష్ణప్రసాద్ కాంబినేషన్లో ఇది నాకు మూడో సినిమా. ఆయన నన్ను నమ్ముతారు. ఆ నమ్మకం ఇద్దరిమధ్య కొనసాగుతోంది. ‘సారంగపాణి జాతకం’ సకుటుంబ సపరివార సమేతంగా మాత్రమే కాకుండా పరకుటుంబ సమేతంగా కూడా చూడదగ్గ చక్కని హాస్యభరిత సినిమా. ప్రియదర్శితో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ఆయన మంచి కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన సినిమా ‘కోర్ట్’ చక్కని విజయం సాధించింది. మాకు ఎప్పటి నుంచో పరిచయం వుంది. ఈ సినిమాతో మా ఇద్దరి కాంబినేషన్ కుదిరింది. ప్రియదర్శి తప్ప ఈ సినిమా ఆయనకు టైలర్‌మేడ్‌లా వుంటుంది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ చాలా బాగా చక్కగా నటించింది. ఈ సినిమాలో నాన్ తెలుగు యాక్టర్లు ఎవరూ లేరు. అందరూ తెలుగువారు నటించిన పరిపూర్ణమైన తెలుగు సినిమా ఇది. అందరూ ఎవరి డబ్బింగ్ వాళ్ళే చెప్పుకున్నారు. అశోక్‌కుమార్, శ్రీనివాస్ అవసరాల, రీల్స్ చేసే సమీరా భరద్వాజ్, ప్రదీప్.. ఇలాంటి ప్రతిభావంతులైన నటులు నటించారు. సమ్మర్లో విడుదల చేయడం అనేది కృష్ణప్రసాద్ గారు తీసుకున్న సరైన నిర్ణయం. అన్ని వయసుల వారికి వినోదాన్ని అందించే ఆరోగ్యకరమైన హాస్యభరిత సినిమా ఇది. ఈ సినిమా చూసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల కళ్ళకు, చెవులకు చేతులు అడ్డు పెట్టాల్సిన అవసరం లేదు’’ అన్నారు.

కథానాయిక రూప కొడువాయూర్ మాట్లాడుతూ, ‘‘నాకు జాతకాల మీద నమ్మకం వుండేది కాదు. నేను గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నా ఫేవరెట్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి అని చెప్పాను. ఊహించని విధంగా ఆయన సినిమాలో నటించే ఆఫర్ రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ధరించే అవకాశం లభించింది. ఒక చక్కని అవగాహన వున్న నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు. ఆయన సినిమాలో నటించే అవకాశం రావడం చాలా సంతోషకరం. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది’’ అన్నారు.

కథానాయకుడు ప్రియదర్శి మాట్లాడుతూ, ‘‘నేను ప్రామిస్ చేసి చెబుతున్నాను. ఇది ఒక గ్రేట్ మూవీ. అందరినీ నవ్వించే సినిమా. ఏప్రిల్ 18 నుంచి తెలుగు ప్రేక్షకులకు సంపూర్ణ వినోదం అందబోతోంది. ఈ మూవీ టీమ్ బ్రిలియంట్ టీమ్.. ఇది నా డ్రీమ్ టీమ్.. ఇంద్రగంటి దర్శకత్వంలో నటించాలన్న నా కల ‘సారంగపాణి జాతకం’ సినిమాతో తీరింది. ఫేవరెట్ టీచర్‌ దగ్గర చదువుకోవడం లాంటిది ఆయనతో పనిచేయడం. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఆయనా ఒక పాజిటవ్ ఫోర్స్. మా యూనిట్ అందరి జాతకాలు చాలా బాగున్నాయి. మేం చక్కని విజయాన్ని అందుకోబోతున్నాం’’ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com