పుష్కరాలకు కాళేశ్వరం ముస్తాబు
12 ఏళ్ల తర్వాత జరుతున్న ఉత్సవాలు
రూ.25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సిఎం రేవంత్
ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు
12 ఏళ్ల తర్వాత జరుతున్న ఉత్సవాలు
రూ.25 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
హారతి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సిఎం రేవంత్
ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు
కాళేశ్వరంలో నేటినుంచి సరస్వతీనదికి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పన్నెండే ళ్లకోమారు వచ్చే ఈ పుష్కరాలు ఈనెల 26వ తేదీవరకు కొనసాగుతాయి. ఈ పుష్కరాలకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఆ భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు..ప్రధానంగా ఈ కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమంలో సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నమ్ముతారు. దక్షిణ భారతదేశంలో సరస్వతి పుష్కరాలు జరిగే ఏకైక పుణ్యక్షేత్రం కాళేశ్వరం కావడం విశేషం. కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ ప్రదేశం. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
డ్రైనేజీ వ్యవస్థ, రోడ్డు విస్తరణ అన్ని సౌకర్యాలు చేపట్టింది. ప్రధానంగా ఈ పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది.భక్తులు పుష్కర సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పుణ్యస్నానాలు చేసి హోమం వంటివి నిర్వహిస్తారు. సరస్వతి నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు నశించిపోతాయని నేను విశ్వసిస్తారు. భక్తులు దేశం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. పుష్కరాల కోసం పోలీసుల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసారు. మొత్తం 3 షిఫ్టుల్లో సుమారు 3500 మంది పోలీసుల విధులు నిర్వహించనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మే 15 ఉదయం 5 గంటల 44 నిముషాలకు సరస్వతీ పుష్కరాలను శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఘనంగా ప్రారంభిస్తారు. ఇదే రోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పుష్కరస్నానం ఆచరించిన తర్వాత కాళేశ్వరం ఆలయంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా సరస్వతీ మాత విగ్రహావిష్కరణ, గోదావరి హారతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి కాళేశ్వరానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. 40 మంది కలిసి పుష్కరాలకు వెళ్లాలని అనుకుంటే వారికోం ప్రత్యేక బస్సులు పంపేలా ఏర్పాట్లు చేశామని అధికార్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఈ నెల 14 బుధవారం నుంచి 24వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ బస్సులు ప్రధాన పుష్కర ఘాట్లకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాలైన జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్, కూకట్ పల్లి, జీడిమెట్ల, మేడ్చల్ నుంచి మెట్రో డీలక్స్ బస్సులు నడుపనున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా.. ఒకే కాలనీలో 40 మంది ప్రయాణికులు ఉంటే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆ కాలనీకే బస్సు పంపించే ఏర్పాట్లు చేశారు . ఇలాంటి ప్రత్యేక బస్సుల కోసం 9676671533, 9959226154, 9959226160 నంబర్లు సంప్రదించండి.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి 790 ప్రత్యేక బస్సులు ఈ పుష్కరాలను వెళ్లనున్నాయి.