తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహావీరుడికి నివాళి అర్పించారు. ఈ మేరకు తాజాగా ఒక సందేశం విడుదల చేశారు. శతాబ్దాల కిందటే రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేదప్రజలను సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సంఘటితం చేశారన్నారు.
రాజకీయ సామాజిక సమానత్వమే మూలసూత్రంగా గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తిగా సర్వాయి పాపన్న చరిత్ర అసామాన్యమయ్యిందన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం వారి ఆశయాలను కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.