-
శ్వేత సౌధం ముందు క్ష్మి‘సారే జహాసే అచ్చా’
-
వైట్ హౌస్ లో రెండోసారి దేశ జాతీయ గీతం
అరుదైన ఘటనకు అమెరికాలోని అధికార భవనం శ్వేత సౌధం వేదికగా మారింది. వందలాది ఆసియా అమెరికన్ల ముందు వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ మహ్మద్ ఇక్బాల్ రచించిన ‘సారే జహాసే అచ్ఛా’ను ప్లే చేయగా ఆహుతులంతా ఎంజాయ్ చేశారు. హెరిటేజ్ మంత్ వేడుకల్లో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. వచ్చిన అతిథులంతా పానీ పూరి తింటూ మరోవైపు సారే జహాసే అచ్చా వింటూ మురిసిపోయారు. భారత దేశ అత్యుత్తమ రుచులను సైతం శ్వేతసౌధంలో అతిథులకు వడ్డించడం విశేషం.
ఈ సందర్భంగా ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ నేత అజయ్ జైన్ భూటోరియా ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ మంత్ వేడుకలకుక తాను హాజరయ్యానని.. అక్కడ ‘సారే జహాసే అచ్చా’తో స్వాగతం లభించడం చాలా సంతోషంగా అనిపించిదన్నారు. నిజానికి ఇది గర్వించదగిన తరుణమన్నారు. తాను కూడా వారితో కలిసి పాడానని.. మరోసారి ప్లే చేయమని కోరానని అజయ్ తెలిపారు. ఏఏఎన్‌హెచ్‌పీఐ హెరిటేజ్ మంత్‌లో ఈ పాటను ప్లే చేయడం ద్వారా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన బృందం భారత్-అమెరికా సంబంధాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నారో అర్థమవుతోందన్నారు. వైట్ హౌస్‌లో భారత దేశభక్తి గీతాన్ని ప్లే చేయడం ఏడాది వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది జూన్ 23న ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్ పర్యటన సందర్భంగా ఈ గేయాన్ని ప్లే చేశారు.