Sunday, April 20, 2025

‘సరిపోదా శనివారం’ నుంచి ఎస్‌జె సూర్య బర్త్‌డే గ్లింప్స్

నేచురల్ స్టార్ నాని ‘సరిపోదా శనివారం’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్సెస్, సాంగ్స్, సినిమా నుండి వచ్చే ప్రతి అప్‌డేట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తున్నాయి. మేకర్స్ ఎస్‌.జె.సూర్య పుట్టినరోజు సందర్భంగా – నాట్ ఏ టీజర్ అనే న్యూ వీడియోని రిలీజ్ చేశారు.

చెడు బలపడినప్పుడు దాన్ని అంతచేసే పవర్ పడుతుందనే ఇంట్రస్టింగ్ వాయిస్ ఓవర్ తో వీడియో ప్రారంభమైయింది. బలహీనులపై తన ఆధిపత్యాన్ని చూపించే రూత్ లెస్ కాప్ గా ఎస్‌.జె. సూర్య పరిచయమయ్యారు. ఈ కథ నుంచి శ్రీకృష్ణుడు తన సత్యభామ తో కలిసి నరకాసురుడు ను ఎదుర్కోవడానికి వస్తున్నట్లుగా ప్రజెంట్ చేయడం క్యూరియాసిటీని పెంచింది.

టేకాఫ్ నుండి చివరి వరకు వీడియో గ్రిప్పింగ్ గా వుంది. ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య ఎపిక్ బాటిల్ గా వుండబోతోందని ప్రామిస్ చేస్తోంది. SJ సూర్య భయం పుట్టించేలా కనిపించగా, నాని తన టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అద్భుతంగా ఉన్నారు. ఇద్దరూ తమ పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొట్టారు. వివేక్ ఆత్రేయ స్టొరీ టెల్లింగ్ లో యూనిక్ స్టయిల్ వున్న జీనియస్. నాట్ ఎ టీజర్ వీడియోలో తన నరేటివ్ స్టయిల్ ఆకట్టుకుంది. మురళి జి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా ఉంది, విజువల్స్ గ్రాండియర్ గా ఉన్నాయి, జేక్స్ బిజోయ్ తన ఇంటెన్స్ బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌తో విజువల్స్ ని మరింత ఎలివేట్ చేశారు. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి.

నాట్ ఎ టీజర్ వీడియో మాస్ మ్యాడ్ నెస్ ఎక్స్ పీరియన్స్ ని ఇస్తుంది. ఆగస్ట్ 29న థియేటర్లలో స్టార్ట్ అయ్యే ట్రూ గేమ్‌ను చూసేందుకు మరింత ఎక్సయిట్మెంట్ ని పెంచింది. ఈ పాన్ ఇండియా అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌కు కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com