తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్ లో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి. మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్. సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అంచనాలని నెక్స్‌ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. ఈ వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ లలో ఒకటిగా ఏప్రిల్ 17న ఓదెల2 థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. తమన్నా భాటియా మాట్లాడుతూ.. ఈ సినిమా ఏప్రిల్ 17న పాన్ ఇండియా థియేటర్స్ లో వస్తుంది. తప్పకుండా వెళ్లి చూడండి. ఈ సినిమా సంపత్, మధు కోసం గొప్పగా ఆడాలని కోరుకుంటున్నాను. 20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్ లో పనిచేశాను. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్, క్రియేటర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ గా ఉండబోతుంది.17 ఏప్రిల్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. మధు ఈ సినిమాని చాలా అద్భుతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించారు. ప్రతి ప్రమోషన్ మెమోరబుల్ గా చేశారు. ఈ ఈవెంట్ కొచ్చి మమ్మల్ని విష్ చేసిన శర్వానంద్‌కి థాంక్యూ. శర్వానంద్, నేను ఎప్పుడూ మీట్ కాలేదు. ఆయనతో కలిసి నటించాలనుంది. శివశక్తి పాత్రను నాకు ఇచ్చినందుకు సంపత్, అశోక్ తేజకు కృతజ్ఞతలు. వశిష్ఠ అద్భుతంగా నటించారు. అజినిస్ ఈ సినిమాకి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను’ అన్నారు.