Monday, June 17, 2024

బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు నటసింహం బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎడిటర్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ – “సత్యభామ” ఒక మల్టీఫోల్డెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు ఎడిటింగ్ తో పాటు కాజల్ అగర్వాల్ కు అసిస్టెంట్ రోల్ లో నటించాను. సుమన్ చిక్కాల డైరెక్టర్ కావాలనే తన కలను ఈ మూవీతో తీర్చుకుంటున్నారు. ఈ టీమ్ నాకొక ఫ్యామిలీ లాంటిది. మా ఫ్యామిలీ మెంబర్స్ కు “సత్యభామ” బిగ్ సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

లిరిసిస్ట్ రాంబాబు గోసాల మాట్లాడుతూ – మా సత్యభామ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారు ఇతర గెస్ట్ లకు థ్యాంక్స్. బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తుంటే ఎంతో ఇన్స్ పైరింగ్ గా ఉంటాయి. సత్యభామ సినిమాలో నేను కళ్లారా చూసాలే అనే పాట రాశాను. శ్రీచరణ్ గారు బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రేయా ఘోషల్ గారు నా పాట పాడటం హ్యాపీగా ఉంది. సత్యభామ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ – బాలకృష్ణ గారు త్వరగా వస్తున్నారని తెలిసి పరుగెత్తుకుంటూ ఈ ఫంక్షన్ కు వచ్చాను. ఆయన నా కెరీర్ బిగినింగ్ లో గుంటూరు టాకీస్ సినిమా టైమ్ లో ఆడియె రిలీజ్ కు గెస్ట్ గా వచ్చి నన్ను బ్లెస్ చేశారు. నలభై సినిమాలు కంప్లీట్ చేశాడు.ఇ ప్పుడు ఈ మూవీకి ట్రైలర్ లాంఛ్ కు వచ్చారు. సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారికి, అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా గురించి మాట్లాడుతాను అన్నారు.

డైరెక్టర్ సుమన్ చిక్కాల మాట్లాడుతూ – యుద్ధంలో కృష్ణుడి కోసం సత్యభామ ఫైట్ చేసింది. ఈ రోజు సత్యభామ ఈవెంట్ కోసం ఈ బాలకృష్ణుడు అతిథిగా వచ్చారు. దశాబ్దాలుగా ఆయన హీరోగా మనల్ని అలరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు. బాలకృష్ణ గారు మూడోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నా. చాలా మంది లెగసీని ఆస్తులుగా తీసుకుంటారు. కానీ బాలకృష్ణ గారు ఛారిటీని లెగసీగా తీసుకున్నారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. నేను దర్శకుడిగా మారేందుకు 15 ఏళ్లుగా కష్టపడుతున్నాను. నా గమ్యం వైపు కష్టంగా నడుస్తున్న టైమ్ లో నా స్నేహితుడు శశి ఆరమ్ ఆర్ట్స్ అనే వెహికిల్ తీసుకొచ్చి అందులో ఎక్కించుకుని ముందుకు తీసుకెళ్తున్నాడు. తన కలను నెరవేర్చుకోడవమే కాదు స్నేహితుడిగా నా కలను కూడా నెరవేర్చిన శశికి థ్యాంక్స్ అనే మాట చెప్పడం చిన్నది. దర్శకుడిగా నా ఫస్ట్ హీరో కాజల్ గారు. ఆమె 60 సినిమాల్లో నటించారు. ఎంతోమంది లెజెండ్స్ తో కలిసి పనిచేశారు. అయినా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. ఒకవైపు శంకర్ గారితో భారతీయుడు 2 చేస్తూ నా డైరెక్షన్ లో సత్యభామ మూవీలో నటించారు. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయం కాజల్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. నా మొదటి హీరోగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను అన్నారు.
నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి మాట్లాడుతూ – బాలకృష్ణ గారి అభిమానిగా ఆ గుంపులో ఉండాల్సిన వాడిని. ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాం. ఆయన రావడంతో రిలీజ్ కు ముందే సక్సెస్ అందుకున్నంత హ్యాపీగా ఉంది. మా మూవీని సపోర్ట్ చేసేందుకు వచ్చిన అనిల్ రావిపూడి గారికి థ్యాంక్స్. కాజల్ అగర్వాల్ గారు మా సినిమా షూటింగ్ టైమ్ లో చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. మేమంతా షూటింగ్ టైమ్ లో అలిసిపోయినా, డే, నైట్ ఆమె చిత్రీకరణకు ఏ రోజూ ఇబ్బందిపెట్టలేదు. సినిమా పట్ల ఆమెకున్న ప్యాషన్ మమ్మల్ని ఇన్స్ పైర్ చేసింది. అందుకే కాజల్ గారిని అందాల రాక్షసి అని పిలుస్తుంటాం. శశికిరణ్ ఈ సినిమాకు ప్రెజెంటర్ గా మాత్రమే కాదు స్క్రిప్ట్ చేసి ప్రతి విషయంలో సపోర్ట్ గా ఉన్నారు. సత్యభామ మూవీని జూన్ 7న థియేటర్స్ లో చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా అన్నారు.

హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ – బాలకృష్ణ గారు, అనిల్ రావిపూడి గారు మా సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు రావడం హ్యాపీగా ఉంది. బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేశాను. సెట్ లో ఆయన ఎనర్జీ చూసి ఆశ్చర్యపోయాను. పదిమంది రౌడీలను కొట్టే ఒక యాక్షన్ సీక్వెన్స్ సింగిల్ టేక్ లో చేశారు. ఆయన ఎన్నో జెనరేషన్స్ కు గుర్తుంటారు. సత్యభామ గురించి చెప్పాలంటే ఒకరోజు శశికిరణ్ ఫోన్ చేసి మూవీ గురించి చెప్పారు. చాలా మంచి సబ్జెక్ట్. నా క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. వెంటనే అంగీకరించాను. కాజల్ అగర్వాల్ ఈ మూవీలో యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటారు. మా చేతిలో ఒక సక్సెస్ ఫుల్ సినిమా ఉంది. సత్యభామ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ – నా చిన్నప్పుడు శాంతి థియేటర్ లో ఆదిత్య 369 సినిమాను మా పేరెంట్స్ తో కలిసి చూశాను. డైరెక్టర్ గా నా ఫస్ట్ మూవీ గూఢచారి అదే థియేటర్ లో చూసినప్పుడు నాకు ఆదిత్య 369 సినిమా చూసిన రోజులు గుర్తొచ్చాయి. బాలకృష్ణ గారు టాలీవుడ్ లో ఉండటం మనందరికీ ఒక ప్రివిలేజ్ లాంటిది. ఆయన టచ్ చేయని జానర్ మూవీ లేదు. ఈ రోజు మా సత్యభామ ట్రైలర్ లాంఛ్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. అనిల్ రావిపూడి గారి ఎనర్జీ మాములుగా ఉండదు. షూటింగ్ టైమ్ లో చూశాను. షాట్ గ్యాప్ లో డ్యాన్సులు చేస్తుంటారు. థ్యాంక్యూ అనిల్ గారు మా ఈవెంట్ కు వచ్చినందుకు. సత్యభామ కథను నా స్నేహితుడు రమేష్ చెప్పినప్పుడు ఈ కథను తప్పకుండా ప్రేక్షకులకు చూపించాలి అనిపించింది. కాజల్ గారికి స్క్రిప్ట్ చెప్పగానే వెంటనే షూటింగ్ ఎప్పటినుంచి ప్లాన్ చేసుకుంటారు అని అడిగారు. మేము సర్ ప్రైజ్ అయ్యాం. ఆమెకు కూడా కథ అంత బాగా నచ్చింది. నవీన్ చంద్ర ఈ మూవీకి బ్యాక్ బోన్. సినిమాలో మీరది చూస్తారు. సత్యభామ ఎమోషనల్ పవర్ ప్యాక్డ్ మూవీ. సాధారణంగా థ్రిల్లర్ సినిమాలు ఒక పాయింట్ ఆధారంగా ముందుకు వెళ్తుంటాయి. కానీ సత్యభామలో మంచి ఎమోషన్ ఉంటుంది. సత్యభామకు వర్క్ చేసిన ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూకు థ్యాంక్స్ చెబుతున్నా అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – సత్యభామ మూవీ చాలా బాగా వచ్చిందని తెలుసు. ఈ మూవీకి మంచి టీమ్ వర్క్ చేసింది. శశికిరణ్ తిక్క, బాబీ తిక్క..వీళ్ల పేర్లలో తిక్క ఉంది గానీ వాళ్ల సినిమాలకు ఓ లెక్క ఉంది. నవీన్ చంద్ర మంచి యాక్టర్. అతనికి ఈ సినిమా సక్సెస్ ఇవ్వాలి. డైరెక్టర్ సుమన్ ఫస్ట్ ఫిల్మ్. ఆయనకు సత్యభామతో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. కాజల్ అగర్వాల్ 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండటం మామూలు విషయం కాదు. మా భగవంత్ కేసరి సినిమాతో ఆమె కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. పోలీస్ క్యారెక్టర్స్ కొందరు హీరోయిన్స్ కే సూట్ అవుతాయి. అప్పట్లో విజయశాంతి గారిలా ఇప్పుడు కాజల్ కు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యింది. ఆమె యూనిఫామ్ లో కూడా చాలా బాగున్నారు. కాజల్ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సులు చేసింది. బాలకృష్ణ గారు 45 డిగ్రీల ఎండల్లో హిందూపూర్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆయనకు ఫోన్ చేస్తే షూటింగ్ కు రెడీ అన్నారు. అదీ ఆయన ఎనర్జీ. భగవంత్ కేసరిలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ గారిని చూపించాను. మళ్లీ అ‌వకాశం వస్తే పోలీస్ క్యారెక్టర్ లో ఆయనలోని పూర్తి ఎనర్జీని చూపిస్తాను. సత్యభామ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – సత్యభామ సినిమా ట్రైలర్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. నేను లైఫ్ లో మరో ఫేజ్ లోకి అడుగుపెట్టిన టైమ్ లో భగవంత్ కేసరి సినిమాలో నటించాను. అప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చిన సపోర్ట్ తో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన లవ్ అన్ కండిషనల్, ఎనర్జీ అన్ మ్యాచబుల్, బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్. అనిల్ రావిపూడి నాకు మంచి ఫ్రెండ్. సత్యభామ కథను శశి తన టీమ్ తో వచ్చి చెప్పారు. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. ఈ కథ మీద ఉన్న నమ్మకం గ్లింప్స్ చూసినప్పుడు రెట్టింపు అయ్యింది. టాలెంటెడ్ టీమ్ మా మూవీకి పనిచేశారు. నా కోస్టార్ నవీన్ చంద్రకు థ్యాంక్స్ చెబుతున్నా. అమర్ గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా నటించలేరేమో. నవీన్ చంద్రతో మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. సత్యభామలో ప్రకాష్ రాజ్ తో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. శశి వల్లే నేను సత్యభామగా మారాను. తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్ ను చేశారు. ఇన్నేళ్లుగా నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్. సత్యభామకు కూడా మీ లవ్ అందిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

నటసింహం బాలకృష్ణ మాట్లాడుతూ – ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్ లో చూస్తున్నాను. సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క..అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. వీళ్లకు ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లోనూ అనుభవం ఉంది. వీళ్లంతా కలిసి అవురమ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించడం. సినిమాలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నాను. సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామ. ఆమె వెంట ఉంటే విజయం ఖాయం. సత్యభామ అనే పేరు వుమెన్ ఎంపవర్ మెంట్ కు ప్రతీకగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణుడికి ఎందరు భార్యలు ఉన్నా సత్య తన చెప్పుచేతల్లో ఆయనను పెట్టుకుంది. మహిళలు ఈ రోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందడటం సంతోషకరం. భగవంత్ కేసరిలో నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. విష్ణు కెమెరా పనితనం బాగుంది. నేనూ మొదట్లో కెమెరామెన్ అవుదామని అనుకున్నా. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉందంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. ఈ రోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఒక్క నారదుడు తప్ప. నేను శ్రీనివాస కల్యాణం సినిమాలో నారదుడిగా నటించా. నాన్న గారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయడం సంతృప్తినిస్తుంటుంది. సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్ తో నటించాలని ఉండేది. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్సీపిరియన్స్. భగవంత్ కేసరిలో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది. సత్యభామ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్ లో చూడండి అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular