- చిన్న బోతున్న చీన్యా తండా
- 500 మంది జనాభా కు మించి ఉంటే తండాలను గత ప్రభుత్వం పంచాయతీలుగా ప్రకటించింది. అయితే పంచాయతీలుగా ఏర్పడ్డ చిన్న గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోక చిన్నబోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చీన్యా తండా నిలుస్తోంది. తండాలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అంగన్వాడీ కేంద్రం, గ్రామపంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేశారు. అలాగే ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలాన్ని క్రీడా ప్రాంగణానికి కేటాయించారు. దీనితో చీన్యా తండాలో ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్ని కార్యకలాపాలకు వేదికగా మారింది. ఫలితంగా పాఠశాల లో విద్యను అభ్యసించే చిన్నారులకు ఆటంకంగా మారింది. ప్రభుత్వ స్పందించి పంచాయతీ కార్యాలయం కోసం మరోచోట భవనాన్ని నిర్మించాలని తండావాసులు కోరుతున్నారు.