Sunday, November 17, 2024

స్క్రీన్ మీద చూడని ఒక అద్భుతం’కంగువ’ – హీరో సూర్య

స్టార్ హీరో సూర్య నటిస్తున్న మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. హైదరాబాద్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో సూర్య మాట్లాడుతూ – ‘కంగువ’ను రిలీజ్ చేస్తున్న మైత్రీ వారికి, మాతో అసోసియేట్ అయిన యూవీ సంస్థకు అందరికీ థ్యాంక్స్. నా రక్తం మీ రక్తం వేరు కాదు. మనమంతా ఒక్కటే. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. నా సినిమా థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి రెండేళ్లు దాటింది. అయినా సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మీరు చూపించిన రెస్పాన్స్ కు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. నాపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతగా మీకు గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వాలనే ‘కంగువ’ లాంటి గొప్ప సినిమా చేశాను. అందుకే రెండున్నరేళ్ల టైమ్ తీసుకుని మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడని ఒక అరుదైన మూవీని చేశాం. దర్శకుడు శివ వల్లే ఇది సాధ్యమైంది. ఆయన ఎంతో ప్యాషన్ తో ‘కంగువ’ను తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ ను ప్రతి రోజూ ఎంజాయ్ చేశాను. నా ఫ్రెండ్ రాక్ స్టార్ దేవికి, నా సినిమాటోగ్రాఫర్ వెట్రికి థ్యాంక్స్. ‘కంగువ’ లాంటి సినిమాలు చేసేందుకు దర్శకుడు రాజమౌళి స్ఫూర్తినిచ్చారు.
ఆయన తన చిత్రాలతో మాకు దారి చూపించారు. కంగువ స్ట్రైట్ తెలుగు సినిమా. ఇండియన్ సినిమా. నవంబర్ 14న మన స్పెషల్ ఫిల్మ్ ‘కంగువ’ చూసేందుకు థియేటర్స్ కు వెళ్లండి. ఇది ఒక పైటర్ సినిమా కాదు ఒక వారియర్ మూవీ. తన వాళ్ల కోసం, తను నమ్మిన ధర్మం కోసం పోరాడే వారియర్ మూవీ. నా లైఫ్ లో మీరు నా వారియర్స్. నా అభిమానులైన మీరు మీ జీవితాల్లో ఒక వారియర్ లా పోరాడి అనుకున్నది సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా. బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పాల్గొనడం మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఆయన సమయపాలన, హార్డ్ వర్క్, ప్యాషన్ చూశాక అందుకే అంత గొప్ప స్థాయికి వెళ్లారనిపించింది. 27 ఏళ్ల నట ప్రయాణంలో నన్నెంతో ఆదరించారు. ట్రేడ్ లో ఒక మార్కెట్ ఇచ్చారు. ఇప్పుడు సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లడం నా బాధ్యతగా భావించా. కంగువ లాంటి ప్రయత్నం చేశాను. నటుడిగా కమల్ హాసన్ ని చూసి ఇన్స్ పైర్ అవుతుంటా. మంచి సినిమాలు సమాజంలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. నా కాక కాక సినిమా చూసి ఒకరు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. జైభీమ్ సినిమా తర్వాత తమిళనాడులో 3 లక్షల మందికి ఇంటి పట్టాలు వచ్చాయి. కంగువ కోసం ప్రతి రోజూ 3 వేల మంది వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ కష్టపడటం వల్లే ఇంత గొప్ప సినిమా తయారైంది అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular