Friday, November 8, 2024

ఓబీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా శొంఠి నాగరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో కూడా కులగణన జరగాలి – వైఎస్ షర్మిలా రెడ్డి

కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ డిమాండ్ చేస్తుంది – వైఎస్ షర్మిలా రెడ్డి

బాబు,జగన్ ఇద్దరు కుల గణన జరుపుతాం అని హామీ ఇచ్చారు

కుల గణన జరిపి బీసీలకు న్యాయం చేయండి – వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

– మన మోడీ ఒక బీసీ
– బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే
– ఆయన బీసీ అయ్యి ఉండి..ఆయన మాత్రమే గర్వంగా ఉన్నాడు
– బీసీలు మాత్రం గర్వంగా లేరు
– “బీసీ ప్రధాని ఫాయిదా కుచ్ నహీ”
– 2017 లో బీసీల కులగణన చేస్తాం అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు
– మళ్ళీ అధికారంలో వచ్చి మాట మార్చారు
– కుల గణన కు బీజేపీ వ్యతిరేకం అన్నారు
– బీజేపీ కి బీసీ ల పట్ల ప్రేమ లేదు
– బీసీలు అంటే అట్టడుగున ఉన్న పేదవాళ్ళు
– బీజేపీ అగ్రకుల పార్టీ
– అదానీ,అంబానీ లకు, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ
– బీసీలు అంటే మోడీకి ఓట్లు వేసే యంత్రాలు
– రాష్ట్రంలో కూడా చంద్రబాబు కి ప్రేమ లేదు
– బీసీల గురించి ఆలోచన చేసిన ఏకైక నాయకుడు వైఎస్ఆర్
– వైఎస్ఆర్ హయాంలో బీసీ జాబితా 143 కి పెంచారు
– బీసీలు అందరు బాగుపడాలని కోరుకున్నారు
– ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టీ బీసీ బిడ్డలను అగ్రస్థానం లో నిలబెట్టారు
– స్కాలర్ షిప్ లు వైఎస్ఆర్ ఇచ్చారు
– బీసీలు వైఎస్ఆర్ ను ఓన్ చేసుకున్నారు
– ఆ రోజుల్లో నాకు గుర్తు ఉంది
– బీసీ సంఘ నాయకుడు ఆర్ కృష్ణయ్య అల్టిమేటం ఇచ్చారు
– బీసీల హక్కుల కోసం ఆమరణ దీక్షకు పిలుపు నిచ్చాడు
– బీసీల మీద గౌరవం తో ఆర్. కృష్ణయ్య ఒక్క నిమిషం కూడా దీక్ష చేయించలేదు
– దీక్ష చేస్తే బీసీలను అగౌరవ పరిచి నట్లు అనుకున్నాడు
– కృష్ణయ్య పెట్టిన 17 డిమాండ్ లు ఒప్పుకున్నాడు
– అసెంబ్లీ లో రిజర్వేషన్లు 50 శాతం పెంచాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపారు
– వైఎస్ఆర్ బీసీల మనిషి అయితే .. చంద్రబాబు బీసీల ద్రోహి
– 10 సూత్రాలతో బీసీల మాస్టర్ ప్లాన్ అన్నాడు
– టీడీపీ బీసీ ల పార్టీ అన్నాడు
– 40 ఏళ్ల నుంచి టీడీపీ నీ మోసేది టీడీపీ అన్నాడు
– బీసీలకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తాం అన్నాడు
– బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అన్నాడు…మోసం చేశాడు
– బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నాడు
– పరిశ్రమలకు ప్రోత్సాహం అన్నాడు
– బీసీల అభివృద్ధి కి ఒక్క రూపాయి ఇవ్వలేదు
– ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ సూపర్ మోసం చేస్తున్నారు
– వచ్చిన 5 ఏళ్లలో విద్యుత్ బిల్లులను 17 వేల కోట్లు జనాలపై మోపారు
– ఇప్పటికే ఇల్లు గడవని స్థాయిలో చాలా కుటుంబాలు ఉన్నాయి
– ఇప్పుడు 40 శాతం అదనంగా పడుతున్న బిల్లులు భారమే కదా
– బీజేపీ సైతం రాష్ట్రానికి ఇచ్చేది గుండు సున్నా
– ఇచ్చిన హామీలు అన్ని పక్కన పెట్టారు
– హోదా లేదు… నిధులు లేవు
– కనీసం ప్రజల మీద విద్యుత్ చార్జీల భారం పడకుండా నిధులు కూడా ఇవ్వలేదు
– అయినా చంద్రబాబు పొత్తు పెట్టు కోవడం దారుణం
– బీజేపీ కి గత 10 ఏళ్లుగా బాబు,జగన్ లు ఊడిగం చేస్తున్నారు
– జగన్ సైతం బీసీలను మోసం చేశాడు
– నా బీసీలు అని మోసం చేశాడు
– ప్రతి ఏడాది 15 వేల కోట్లు ఇస్తా అన్నాడు
– 5 ఏళ్లలో 75 వేల కోట్లు ఇస్తా అన్నాడు
– ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
– 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు 75 వేలు ఇస్తా అన్నాడు
– ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
– కార్పొరేషన్ లు ఇచ్చాడు… ఇచ్చి రూపాయి కూడా ఇవ్వలేదు

– బీసీల అభివృద్ధి కి కట్టుబడి ఉండేది కాంగ్రెస్ పార్టీ
– కాంగ్రెస్ కుల గణన అడుగుతుంది
– బీసీలకు న్యాయం జరగాలి అంటే కుల గణన జరగాలి
– ఎంత మంది బీసీలు ఉన్నారు తేలాలి
– రిజర్వేషన్లు 50 శాతం కాదు .. ఎక్కువే కావాలి
– కుల గణన చేస్తే న్యాయం జరుగుతుంది
– కులాల వారిగా సంపదను పంచాలి
– తెలంగాణ లో ఇప్పటికే కుల గణన జరుగుతుంది
– ఆంధ్రలో కూడా కుల గణన జరిపించండి
– చంద్రబాబు ను డిమాండ్ చేస్తున్నాం
– బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుల గణన కావాలని అడిగారు
– జగన్ సైతం కుల గణన చేస్తా అన్నాడు
– కుల గణన జరిగితేనే ఎవరు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది
– కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
– వెంటనే ఆంధ్రలో కుల గణన జరపండి
– కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది..
– బీసీల పక్షాన నిలబడతం
– ఈ దేశంలో అత్యధికంగా ఉన్న వాళ్ళు బీసీలే

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

మూసీ ప్రాంతంలో కేసీఆర్‌కు ఇల్లు, బెడ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల నిర్ణయాన్ని మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular