నాగచైతన్య, శోభితల వివాహం డిసెంబర్4న అన్నపూర్ణస్టూడియో వేదికగా జరగనుంది. ఏయన్నార్ విగ్రహం సాక్షిగా ఒక్కటయ్యే ఈ జంట.. గురువారం నుంచి పెళ్ళితంతు మొదలుపెట్టింది. పెళ్లిలో అతి ముఖ్యమైన మొదటి ఘట్టం హల్దీ వేడుకను ఇరు ఫ్యామిలీలు పూర్తి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో కాబోయే వధూవరులకు ఒకే చోట మంగళ స్నానాలు చేయించారు. సాధారణంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు మంగళ స్నానాలు వేరు వేరుగా చేయిస్తారు. కానీ నాగ చైతన్య, శోభితలకు మాత్రం మంగళ స్థానాలు ఒకే చోట, ఒకే రోజు చేయించడం విశేషం. ఇది వారి సాంప్రదాయామా లేదంటే పెళ్లి తంతు స్ట్రీమింగ్ రైట్స్ ఓటీటీ వారికి ఇచ్చారు కనుక షూటింగ్‌కి అనుకూలంగా ఉంటుందని, సినిమాటిక్‌గా ఉంటుందని భావిస్తున్నారా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రక్రియతో శోభిత, నాగ చైతన్యల పెళ్లి తంతు మొదలైందని మంగళ స్నానాల వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం ద్వారా క్లారిటీ ఇచ్చారు. పెళ్లికి ఇంకా సమయం ఉండగానే మంగళ స్నానాలు పూర్తి చేయడంతో.. రాబోయే రోజుల్లో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమం రూపంలో పెళ్లి తంతు జరుగుతూనే ఉంటుంది. హిందూ బ్రాహ్మణ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి వేడుక జరుగుతుంది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భావించినప్పటికీ మంగళ స్నానాలకు సంబంధించిన ఫోటోలు అప్పుడే బయటకు వచ్చాయి. ముందు ముందు పెళ్లి తంతు ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.