Tuesday, May 13, 2025

శివకార్తికేయన్-ఏఆర్ మురుగదాస్ రెండో షెడ్యూల్ ప్రారంభం

శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో భారీగా నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఉత్తమ తారాగణం,టెక్నీషియన్స్ తో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తాజాగా యూనిట్ రెండో షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టారు. ఈ కీలక షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలని చిత్రికరిస్తున్నారు.

దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన పాపులర్ స్టొరీ టెల్లింగ్ స్టయిల్ లో, యునిక్ సెట్టింగ్‌తో చిత్రాన్ని రూపొందిస్తున్నారు . ఈ చిత్రం హై యాక్షన్-ప్యాక్డ్ అనుభూతిని అందిస్తుంది. వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్‌లను అందజేస్తున్న హీరో శివకార్తికేయన్ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్, గ్రాండియస్ట్ చిత్రం కానుంది. శివకార్తికేయన్ ఇంతకు ముందు చూసినట్లుగా కాకుండా పూర్తిగా ప్రత్యేకమైన, స్టైలిష్ అవతార్ లో కనిపిస్తారు. ట్యాలెంటెడ్ కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com