Thursday, November 14, 2024

బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు

విచారణకు ఆదేశించిన మంత్రి లోకేశ్

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారించాలని ఆదేశించారు. తప్పుచేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్. కాలేజీల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.

కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అంతకుముందు ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తునకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్‌ కళాశాలలో అమ్మాయిల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌ కెమెరాలు కలకలం సృష్టించింది. దీంతో కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం కావాలి అంటూ నిరసనకు దిగారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్‌ వాష్‌రూమ్‌లో హిడెన్‌కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి విక్రయిస్తున్నాడంటూ ఫైనల్‌ ఇయర్‌ బీటెక్‌ విద్యార్థి విజయ్‌పై దాడికి సహచర విద్యార్థుల యత్నించారు.

విషయం తెలుసుకుని కళాశాల హాస్టల్‌కు చేరుకున్నారు పోలీసులు. విద్యార్థులను అదుపు చేసిన అనంతరం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థి విజయ్‌ను ప్రశ్నించారు. విద్యార్థి ల్యాప్‌ట్యాప్‌, సెల్‌ఫోన్‌ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో విజయ్‌కు గర్ల్స్ హాస్టల్ కు చెందిన మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ విద్యార్థులు ఆరోపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular