Saturday, May 3, 2025

సికింద్రబాద్‌ నుంచి మరో రెండు వందేభారత్‌ స్లీపర్లు

సరి కొత్త టెక్నాలజీతో రూపు దిద్దుకుంటున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమయ్యాయి. తొలి విడతలో నే ఈ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేందుకు ఆమోదం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో, దూరపు ప్రయాణాల కోసం వందేభారత్ స్లీపర్ ను కేటాయించాలని రెండు రాష్ట్రాల ఎంపీలు రైల్వే శాఖ పైన ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో, రెండు వందేభారత్ స్లీపర్ ఖాయమైనట్లు సమాచారం. పెరుగుతున్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు ప్రస్తుతం 136 మార్గాల్లో నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయిదు రైళ్లు కొనసాగుతున్నాయి. అయితే, వందేభారత్ స్లీపర్ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్లు తొలి విడతగా 9 సర్వీసులు ప్రారంభించేలా నిర్ణయం చేసారు. అందులో తెలుగు రాష్ట్రాలకు రెండు కేటాయించేలా నిర్ణయించినట్లు సమాచారం. వీటికి సంబంధించి రూట్ పైనా స్పష్టత వచ్చింది. ఈ రైళ్లలో ఏపీ ఫస్ట్‌ క్లాస్‌, సెకండ్‌ క్లాస్‌ ఏసీ, ఏసీ త్రీ టైర్‌ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయి. మొత్తం 24 వందేభారత్ స్లీపర్ రైళ్ల కోసం ప్రస్తుతం ఆర్డర్లు ఉన్నాయి. విజయవాడ టు అయోధ్య ఇక, తెలుగు రాష్ట్రాల నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు విజయవాడ నుంచి అయోధ్య / వారణాసి వరకు కేటాయించాలని సూత్ర ప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుంచి వరంగల్ మీదుగా ప్రస్తుతం రెగ్యులర్ రైళ్లు ప్రయాణించే మార్గంలోనే వందే భారత్ స్లీపర్ ను అయోధ్య కు కేటాయించేలా నిర్ణయం ఉంటుందని తెలుస్తోంది. రాత్రి సమయం లోనే ఈ రైలు ఉండేలా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి ఢిల్లీ కి వందేభారత్ స్లీపర్ రైలు ప్రతిపాదన పైన తుది కసరత్తు జరుగుతోంది. రైల్వే మంత్రికి నేరుగా ఈ రైలు కేటాయింపు కోసం వినతులు వస్తున్నాయి. అదే విధంగా విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందేభారత్ స్లీపర్ రైళ్ల కేటాయింపు కోసం రైల్వే శాఖకు ప్రతిపాదనలు అందాయి.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com