కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్
పార్టీలో చేరికలపై కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాపాడుకోలేకపోతున్న నాయకులను తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నామని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ అధిష్టానం అసంతృప్తి నేతలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఫిరాయింపులు తెలంగాణలోనే కాదని దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. కేవలం కెసిఆర్ కారణంగానే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయని ఆయన తెలిపారు. రాజకీయాల్లో బిఆర్‌ఎస్‌కో న్యాయం కాంగ్రెస్‌కు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో బిఆర్‌ఎస్ సరైన పద్ధతిని పాటించడం లేదన్నారు. చట్ట పరమైన అంశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొంటుందన్నారు.