Thursday, March 13, 2025

కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు కెటిఆర్‌కు లేదు

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు కెటిఆర్‌కు లేదని ఆయన మండిపడ్డారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతికత బిఆర్‌ఎస్ నాయకులకు లేదని ఆయన విమర్శించారు. గాంధీభవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కెసిఆర్ సిఎం అయ్యేవారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో కూల్చివేస్తానని కెటిఆర్ అంటున్నారని, నీ వయసు ఎంత? నీ శక్తి ఎంత? వయసుకు మించి కెటిఆర్ మాటలు మాట్లాడుతున్నావని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ తండ్రి కెసిఆర్ కూడా కాంగ్రెస్ అనే మర్రివృక్షం నుంచి వచ్చినవాడే అని మరచిపోయావా అని కెటిఆర్ మీద జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com