Wednesday, April 30, 2025

బిఆర్‌ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబం చీలిపోయింది కేశవరావు ఆరోపణ

బిఆర్‌ఎస్ పార్టీ కారణంగా నా కుటుంబం చీలిపోయిందని కేశవరావు ఆరోపించారు. కేశవరావుకు ఆయన కుటుంబ సభ్యులకు పార్టీలో పదవులు ఇచ్చినప్పటికీ బిఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారని కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కెకె స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని ఆయన ఎమోషనల్ అయ్యారు.

బిఆర్‌ఎస్‌లో ఉన్నన్నీ రోజులు తనకు ఓరిగింది ఏమి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా సీనియర్ అనే గుర్తింపు అయినా ఉండేదని, బిఆర్‌ఎస్‌లో సీనియర్ అనే గానీ అసలు గుర్తింపు లేదని ఆయన షాకింగ్స్ కామెంట్స్ చేశారు. పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని ఆయన చెప్పారు. తన కుమారుడు విప్లవ్‌కు ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదని కెకె పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com