Saturday, April 12, 2025

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినా కేంద్రం స్పందించడం లేదు: కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికి తెలంగాణలో వడగాల్పులతో 97 మంది మృతి చెందారని ఆయన తెలిపారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తెప్పించలేక పోయారని ఆయన విమర్శించారు.

రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడినా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కనీసం పట్టించుకోలేదని జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. వడదెబ్బకు రాష్ట్రంలో 97 మంది మరణిస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని కోదండరెడ్డి అన్నారు. తెలంగాణలో అనేక జిల్లాల్లో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com