Wednesday, June 26, 2024

కెసిఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉంది

  • విద్యుత్ కమిషన్ విచారణకు కెసిఆర్ సహకరించకపోవడం
  • ఆయన నేరాన్ని అంగీకరించినట్టే
  • కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కెసిఆర్ తీరు దొంగే పోలీసులను బెదిరించినట్లు ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. విద్యుత్ కమిషన్ విచారణకు కెసిఆర్ సహకరించకపోవడం అంటే ఆయన నేరాన్ని అంగీకరించినట్టేనని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ నర్సింహారెడ్డికి కెసిఆర్ రాసిన లేఖపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు.

ఈ విషయమై ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ కమిషన్ అధికారిని కెసిఆర్ నేరుగా భయపెడుతున్నారని ఆయన ఆరోపించారు. న్యాయవ్యవస్థను కెసిఆర్ కించపరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ విచారణ సరిగ్గా లేదని జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణ నుంచి తప్పుకోవాలని కెసిఆర్ లేఖలో పేర్కొనడంతో పలు పార్టీల నాయకులు కెసిఆర్ వైఖరిని తప్పుబడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular