Thursday, May 8, 2025

సెన్సిటివిటీకి… ఎమోషన్‌కి తేడా తెలియదంటావా?

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్ సమంత ఇప్పుడు కొత్త బాధ్యత మీద వేసుకుంది. నిర్మాతగా ఆమె చేసిన తొలి ప్రయత్నం ‘శుభం’ మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో తెరకెక్కిన ‘శుభం’ ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. యంగ్ టీం తమ సినిమాను బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా ‘శుభం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సమంత చాలా సంతోషంగా కనిపించింది. ఐతే ఈవెంట్ లో భాగంగా సమంత ఒకసారి కళ్లు తుడుచుకున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయ్యింది. సమంత ఎమోషనల్ అవుతుందని ఆమె ఇంకా ఏదో విషయంలో బాధపడుతుంది అన్నట్టుగా మీడియాలో వార్తలు రాసుకొచ్చారు. ఐతే లేటెస్ట్ గా ‘శుభం’ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమాకు సంబందించిన విషయాల గురించి ప్రస్తావించారు. దాంతో పాటుగా తన వీడియో గురించి క్లారిటీ ఇచ్చారు. ఐ సెన్సిటివిటీ వల్ల కళ్ల వెంట నీళ్లు వచ్చాయి అందుకే దాన్ని సరిచేసుకున్నా అంతే కానీ అది వేరే ఏమి కాదని అన్నారు సమంత. ఇలాంటి వార్తలను దయచేసి నమ్మకండి అని అన్నారు. సమంత అంతకుముందు శాకుంతలం సినిమా ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అయ్యారు. మరి అది కూడా జస్ట్ ఐ సెన్సిటివ్ అంటారేమో.. ఐతే ‘శుభం’ ఈవెంట్ లో మాత్రం ఆమె వీడియో చూసి సమంత ఎమోషనల్ అవుతుందనే అనుకున్నారు. ఐతే సమంత నెక్స్‌ట్‌ మా ఇంటి బంగారం సినిమాతో రాబోతుంది. సెన్సిటివిటీకీను..ఎమోషన్స్‌కి తేడా తెలియదంటావా సమంత. మీ బాధకి అసలు కారణం ఏంటో మీరు చెబితేనే తెలుస్తుంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com