అందుబాటులోకి తీసుకొచ్చిన శంషాబాద్ విమానాశ్రయం అధికారులు
ప్రైవేటు చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నవారికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ఓ వెసులుబాటు తీసుకువచ్చింది. ప్రైవేటు విమానాల్లో ప్రయాణించే వినియోగదారులకు ప్రత్యేక టెర్మినళ్లను సోమవారం ప్రారంభించింది.
ఇకపై ప్రైవేటు విమానాలను ఉపయోగించే ప్రయాణికులు సాధారణ ప్రయాణికుల టెర్మినళ్లలో రద్దీని భరించడం తప్పుతుంది. వ్యాపార నిమిత్తం లేదా వ్యక్తిగత ప్రయాణాలకు వారి స్వంత ఛార్టర్ విమానాలను వినియోగించుకునే వారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని, వారి ప్రయాణం మరింత సులభం అవుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు, ఆధునిక సాంకేతిక టెక్నాలజీ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.