వ్యాపారి ఇంట్లో 2 కిలోల బంగారం, రూ.3 కోట్ల నగదు చోరీ
హైదరాబాద్‌లో నేపాల్ గ్యాంగ్ భారీ దోపిడీ చేసింది. పనిమనుషులుగా తాము పనిచేస్తున్న ఇంట్లోనే రెండు కిలోల బంగారం, మూడు కోట్ల రూపాయలు కాజేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో నేపాల్ గ్యాంగ్ లూటీ చేసింది. వ్యాపారవేత్త దంపతులు గత రాత్రి తినే ఆహారంలో మత్తు మందు కలిపి సొమ్ము కాజేశారు. అయితే వ్యాపారవేత్త హేమరాజ్ ఉదయం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వచ్చే చూసే సరికి విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారిని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నేపాలి పనివాళ్ల కోసం తూర్పు మండల డీసీపీ బృందం ప్రత్యేక బలగాలతో గాలిస్తున్నారు.